<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): పద్మార్పిత గారితో ఇంటర్యూ – 3 <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

19 Jun 2014

పద్మార్పిత గారితో ఇంటర్యూ – 3






పద్మం: అలాకాదు పద్మా...  ఇంకో పర్సనల్ ప్రశ్న అడుగుతున్నాను. చెప్పడం చెప్పకపోవడం నీ ఇష్టం. అలా అని దాటేయకు సుమా...
పద్మార్పిత: అబ్బో!! ఏంటో అది.
పద్మం: మీకు పెళ్లయిందా??    

*       *       *       *       *

పద్మం           : మీకు పెళ్ళయిందా ??
పద్మార్పిత      : యస్ మై డియర్. అయింది.
పద్మం           : అవునా !!!!! :-(( 
పద్మార్పిత      : ఎందుకలా మొహం మాడ్చుకున్నావు? అప్పుడెప్పుడో 2008 నవంబర్ లో అయింది. అభిమానులను కుడా ఇన్వైట్ చేసేదాన్ని. కానీ అప్పుడు వాళ్ళెవరూ నాకు తెలియదు కదా!
పద్మం           : అవునా!! ఇలా మా అందరికీ షాకులిస్తే ఎలాగండి.
పద్మార్పిత      : ఇంకో విషయం చెప్పనా? నాకు పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా బోలెడంతమంది మనవవరాళ్ళు కూడా.
పద్మం           : అవునా.. చెప్పండి చెప్పండి. ఎప్పుడు ? ఏమిటి ? ఎలా ?
పద్మార్పిత      : చెప్తాను విను. అప్పుడు, ఉరుముల మెరుపుల గాలివాన ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. నా మనస్సులో మాత్రం ఏదో ప్రశాంతత. ఆపుడోచ్చింది ఆ అర్ధరాత్రి ఒక ఆలోచన. పెళ్లి చేస్కోవాలని. అనుకున్నదే తడవుగా, నా ఆప్తులతో చర్చించి అప్పుడే, ఆ బలహీన క్షణానే పెళ్లి చేస్కున్నాను.
పద్మం           : స్టొరీ కొంచెం వెరైటీగా ఉంది. చెప్పండి చెప్పండి....
పద్మర్పిత       : ఓహో...ఇంత క్యురియాస్ గా ఉందా? పెళ్లి ఎవరితో అంటే__________________.

పద్మం           : హా హ్హా హా... నిజమే నిజమే.. అలా మొదలైందన్నమాట. మరి పిల్లలు, మనవరాళ్ళు ?
పద్మార్పిత      : ప్రతి కవిత ఒక ప్రసవవేదనగా భావిస్తే నా కవితలన్నీ అందమైన, ముద్దు ముద్దు పిల్లలే కదా! వాటికి స్పందించే అభిమానుల/ పాఠకుల కామెంట్లే నాకు మనవళ్ళు, మనుమరాళ్ళు.
పద్మం           : పద్మా... ఇలా కవితలని, బ్లాగుని, మీ అభిమానులను అందర్నీ ఒక కుటుంబంగా భావించి, మీరు చూపించే ప్రేమకు మా అభిమానుల అందరి తరపున సలాం. ఒకసారి శ్రీపాద గారు అన్నారు మీరొక సంస్థ అని. అది ముమ్మాటికీ నిజం.
పద్మార్పిత      : అలా అని నన్ను మీ అందర్నుంచి వేరు చేస్తారా? ఇదేం బాలేదు.
పద్మం           : ఇలా గోముగా అల్లరి చేస్తావనే, హరినాద్ గారు నిన్ను అల్లరి అర్పిత అంటారు. ఇజమే మరి.
పద్మార్పిత      : ఓహో... ఇప్పుడర్థమైంది. వాళ్ళందరి తరపున నన్ను ఇంటర్యూ చేయడానికి వచ్చావా?
పద్మం           : కాదు కాదు. నేనే స్వయంగా దివి నుంచి భువికోచ్చాను. నీ కీర్తి పతాకాలు మా లోకంలో కూడా రెపరెపలాడుతున్నాయి మరీ....
పద్మార్పిత      : అమ్మా పద్మమా. చాలమ్మా నీ తిట్ల దండకం.
పద్మం           : అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. మీ తిట్ల కవిత సూపర్. ఎవరైనా తిడితే కోపమొస్తుంది. అదేంటో గానీ మీరు తిడితే ఉన్న కోపం కూడా తుర్రుమని ఎగిరిపోతుంది.
పద్మార్పిత      : అవునా! ఏదేదో చెప్పెస్తావ్ నువ్వు.
పద్మం           : ఇప్పుడు మీ అభిరుచులు ఇష్టాలు మాతో పంచుకుంటారా?
పద్మార్పిత      : ఓ యస్. అడిగేసేయ్.
పద్మం           : మీకు ఇష్టమైన ఆట.
పద్మర్పిత       : దాగుడుమూతలు.
పద్మం           : అవునా. ఇప్పటికీ కంటిన్యు చేస్తున్నారా? బావుంది బావుంది.  మీ లక్కీ నెంబర్ ?
పద్మార్పిత      : పద్నాలుగు.  (ఎందుకంటె పలికేటప్పుడు “పద్మా” అని అందులో కలుస్తుంది కదా!)    
పద్మం           : మీ పేరంటే అంతిష్టం అన్నమాట. మీకు నచ్చిన ఒక సినిమా?
పద్మార్పిత      : ఫత్మా
పద్మం           : ఇది కూడా మీ పేరులో కలుస్తుందన్నమాట. అయితే మీకు నచ్చే హాస్య నటుడు?
పద్మార్పిత      : పద్మనాభం గారు.
పద్మం             : మీరు ఏ పార్టీకి వోట్ వేసారు?
పద్మార్పిత      : కేంద్రంలో చక్రం తిప్పుతోంది కదా. అదేనండి పద్మం గుర్తున్నది.
పద్మం           : మీరు ఇష్టంగా తినే పళ్ళు?
పద్మార్పిత      : కమలా పళ్ళు.
పద్మం           : మీరు అందుకోవాలనే అవార్డులు ఏవైనా ఉన్నాయా?
పద్మార్పిత: నా పేరుమీదనే అవార్డులు ఇస్తుంటే ఇంకా నాకు అవార్డులు ఎందుకు. (పద్మశ్రీ, పద్మ భూషణ్) మీరందరూ నాతొ ఉంటె అదే చాలు.
పద్మం: అయ్యబాబోయ్... అన్నిటికీ అన్ని ఫటాఫట్ సమాధానాలు చెప్తారు. మిమ్మల్ని విశ్లేషించాలంటే సతీష్ కొత్తూరి గారే కరెక్ట్. నా లాంటి మందబుద్ధులకు అది చాలా కష్టం.
పద్మార్పిత: నీకు మందబుద్దా!! ఇక్కడ నన్ను ఎడా పెడా ఎకిపారేస్తుంటే. ఏదీ ఒక సామెత విసురు చూద్దాం!
పద్మం: ఇంకేం విసరను. మీ “ నటనా జీవితం “ ఐస్క్రీం ఫోటో లో ఉన్న మీ అభిమాని... కవితకొకటి విసురుతుందిగా.
పద్మార్పిత: ఓహో.. వాళ్ళపై కూడా నీ రీసెర్చ్ జరుతోందా? ఇంక నన్ను వదిలేయ్ తల్లీ. ఇక్కడ ఆఫీస్కి టైం అవుతోంది. నీ ప్రశ్నలేమైనా ఉంటే, నెక్స్ట్ పార్ట్ లో అడుగు. వస్తాను.టేక్ కేర్........
 

23 comments:

  1. పద్మార్పితతో మీరు జరిపిన "Interview "
    చాలా ఆహ్లాదకరంగా, సాఫీగా సాగింది.
    మొదట మీకు అభినందనలు.

    మంచి ప్రశ్నలను ఎన్నుకున్నారు.
    ప్రొవోకింగ్ లేని మీ అన్ని ప్రశ్నలకూ
    పద్మార్పిత చాలా భావయుక్తంగా , చలోక్తిగానూ సమాధానమిచ్చింది .
    ఏది ఏమయినా మమ్మల్ని 'మనమళ్ళు' గా (just for FUN) మార్చేసిందిగా.
    అమ్మమ్మగా ఇంకా ఇంకా ఎదగాలని , సాహిత్య పిల్లల్ని మరెందరినో మనకు అందించాలని
    మనస్పూర్తిగా అభిలాషిస్తూ , మంచి ముఖాముఖిని అందించినందుకు మీకు,
    చిలిపైన సమాధానాలిచ్చి అందరినీ 'అలరించిన' మా పద్మార్పితకూ.....
    హార్దిక అభినందనలు.

    *శ్రీపాద

    ReplyDelete
  2. వచ్చేసా వచ్చేసా......ఇంటర్వూ అదిరింది. మొత్తానికి "పద్మ" తిమ్మని బమ్మిని చేసింది. ఈవిధంగా అనామికను ఐస్ క్రీం పాపను చేసి అర్పితని అమ్మమ్మను చేసారు.......హ హ హా:-) :-) అర్పిత అమ్మమ్మాయెనే, అందరికీ ఆరిందగా మారెనే.❤ ❤ ❤ ❤

    ReplyDelete
  3. అదరగొట్టారు ప్రశ్నలు జవాబులు.

    ReplyDelete
  4. అందాలరాకాసి అర్పితని అమ్మమ్మను చేయడం అన్యాయం
    అరిచి గోల చేద్దామంటే అడ్డొస్తుంది మీ అందరి అభిమానం:-)

    పద్మార్పిత పదాల ప్రసవవేదన గమనించిన మీకు వందనం
    పొంగిన భావమని ఇన్ని పద్యపిల్లల్ని పుట్టించడం నేరం:-)

    పద్మని విరులసిరులని మాయచేసి చెప్పించారు రహస్యం
    అతి రహస్యం బట్టబయలు చేసి తెప్పించారు హాస్యం :-)

    పద్మ అర్పించే భావాలని మీరు అభిమానించడం నా భాగ్యం
    చిరకాలం ఇలాగే కోరుకుంటూ చేస్తున్నా మీకు నమస్కారం!

    ReplyDelete
    Replies
    1. సాహిత్యాన్ని మధించి
      అక్షరాలను ఛేదించి
      అలవోకగా పండించి
      అనుభవాన్ని జోడించి
      భావబొమ్మల్ని చిత్రించి
      పరిజ్ఞానంలో అమ్మ(మ్మ) వైనావేమో ...
      అంతే గాని "పదహారు" మొన్నే నిండిన నిన్ను

      అమ్మమ్మా అని ఎవరనగలరు..'హమ్మమ్మా'.
      చిన్నా పెద్దా .. అనే తారతమ్యాలు తెలియని
      నీవు మాకందరికీ ఓ చిలిపి చిన్నారివే
      ఇప్పటికీ .. మరెప్పటికీనూ.
      నీ జ్ఞాన సంపద ముందు నా (మా) లాంటి వారు
      ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పద్యపిల్లలం.
      ఇందరి మన్ననలందుకున్న నీవు ధన్యురాలివి

      పద్మార్పితా .... అభినందనలు.

      *శ్రీపాద

      Delete
    2. అర్పితా పెళ్ళైనా అవలేదని చెప్తే ప్రేమించేవాళ్ళు మరింత ఉత్సాహంగా ఉండేవారేమో :-) ఇలా నిరాశపరచడం ఏం బాలేదు. అయినా అమ్మైనా అమ్మాయైనా అమ్మమ్మైనా నేను నేను మాత్రం ప్రేమిస్తూనే ఉంటను (అర్పితాక్షరాలని). "ఐ లవ్ యు టూ"

      Delete
    3. మీరు మా హృదయంలో ఎప్పటికి పదహారణాల పరువాల పడుచు పద్మార్పితే

      Delete
    4. అందాలరాక్షసి అర్పిత....హ హ హా:-)

      Delete
  5. అమ్మమ్మ అయినా ఆమెకి అర్పిత అమ్మైనా
    అక్షరాలతో ఆడుకునే ఆమె అందరినీ అలరించే అల్లరి పిల్లే.

    ReplyDelete
  6. ఇంటర్వ్యూ అహ్లాదంగా సాగేలా రాసి ఆనందింపజేసారు. అభినందనలు

    ReplyDelete
  7. అడవలసినవి అడిగేసి ఆనందంగా నవ్వించారు. బాగుందండి

    ReplyDelete
  8. ఇంటర్వూ రసరమ్యంగా సాగింది. చలోక్తులతోపాటు విషయాలని రాబట్టాలనే ప్రయత్నం చేసారు. కానీ పద్మార్పిత "పద్మం" కన్నా రెండక్షరాలు ఎక్కువేకదా :-) మంచిప్రయత్నం. అభినందనలు.

    ReplyDelete
  9. అంతా పద్మార్పితం. ఇంటర్వ్యూ చేసిందీ పద్మం చెప్పింది పద్మార్పితం. మరీ ఇంత అభిమానమా!!!!????నాకు కూడా అభిమానమే :)

    ReplyDelete
  10. అందరినీ మనవళ్ళు మనవరాళ్ళు అంటే ఎలా పద్మా:-)

    ReplyDelete
  11. అంతుందా ఇందులో :-)

    ReplyDelete
  12. పద్మార్పితను చదవాలంటే కొంచెం కష్టమే. ఎప్పుడు ఏ భావంతో అక్షర సుమాలు వెదజల్లుతుందో తెలీదు.
    బట్.. ఆ క్షణాన ఆమె మనోభావం అందులో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అదే నా వివరణలను తట్టి లేపుతుంటుంది. మీ ఇంటర్వ్యూ సున్నితంగా ఉంది. బాగుంది.

    ReplyDelete
  13. సతీష్ నేను నీతో ఏకీభవిస్తున్నాను. నా జీవితానుభవంలో విభిన్న కోణాల్లో ప్రతిభ కనబరిచే స్త్రీ తారసపడ్డం ఆమె పద్మార్పిత అవడం ఆనందంతో పాటు ఆశ్చర్యాన్నిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

    ReplyDelete
  14. ప్రశ్నల అల్లిక జవాబుల కూర్పు బాగుంది. ఇంటర్వ్యూ అరోగ్యవంతంగా సాగింది.

    ReplyDelete
  15. itlani pareshaan jestada. mastugundi

    ReplyDelete
  16. చిలిపిప్రశ్నలతో సాఫీగా సాగింది

    ReplyDelete
  17. నేను మీలో ఒకరు కావాలన్న ఉవాచ

    ReplyDelete
  18. అడగాల్సిన ప్రశ్నలు అడకుండా అర్థవంతంగా ముగించేయకండి ఇంటర్వ్యూని....కంటిన్యూ ఇట్

    ReplyDelete
  19. Voting poll ki comment ekkada rayamantaru?

    ReplyDelete