ఉద్యోగరీత్యా కార్యాలయానికి వెళ్ళినప్పుడు మాటల్లో అనుకోకుండా పద్మార్పిత బ్లాగ్ చూడ్డం జరిగింది. ఇన్నాళ్ళు ఏదో కోల్పోయిన భావం నాలో ఉండేది. కొద్దిరోజుల్లో పదవీ విరమణ చేయబోతున్న నేను ఏం చేయాలి అనుకునే సమయంలో ఆమె బ్లాగ్ చూసి కవితలు చదువుతు కాలక్షేపం చేయవచ్చు కొన్నాళ్ళు అనే ధైర్యాన్ని ఇచ్చాయి.
ఆమె కవితలు అద్భుతం అనడంలో సంకోచమే లేదు. ఈరోజుల్లో ఇంత సరళ పదాలతో తెలుగుభాషలోని తీపిదనాన్ని గుర్తుచేసిన ఆమె భాషాపటిమకు అబ్బురంతోపాటు ఆనందం కలిగించింది. ఇక పద్మార్పిత ఫాన్స్ అంటూ కమెంట్స్ వ్రాసినవి చదివి, కొద్దిసేపు ఇది నిజమా లేక కలా అనుకుని ఈ బ్లాగ్ చూస్తే ఏవైనా నాలుగు మాటలు వ్రాయకపోతే చదివి దండగని వ్రాస్తున్నాను. నాకు చదివి ఆస్వాదించడమే తప్ప వాటికి అక్షర రూపం ఇవ్వడమ్రాదు. బ్లాగ్ చూసి పొందిన అనుభూతిని ఒక అభిమానిగా పంచుకోవాలని వ్రాసాను.
ఇట్లు
విశ్వేశ్వర్రావు
సదా మీ ఆశీర్వచనాలు ఆమెకు ఉండాలని కోరుకుంటూ పద్మార్పిత గారిపై ఇక్కడ మీరు మీ భావాల్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండి.
::Happy Superannuation ::
wow...good expression sir, happy retired life
ReplyDeleteమీ అభిమానం హర్షనీయం. చిత్ర పెయింటింగ్ చాలా బాగుంది.
ReplyDeleteSo nice thought.
ReplyDeleteమాకు కానరాలే ఎట్లనోఏమో
ReplyDeleteNice painting and words
ReplyDeleteగుడ్ ఎక్ష్ప్రెషన్
ReplyDeleteఅనుకున్నది వెంటనే చేయడం ప్రశంసనీయం.
ReplyDeleteసరైన సమయంలో స్పందన బాగుంది
ReplyDeleteబాగాచెప్పారు
ReplyDeleteచెప్పేసారు..అదీ భేషుగ్గా :-)
ReplyDeleteవిశ్వేశ్వరావుగారి అభిమానానికి ధన్యవాదాలు. చిత్రాన్ని సేకరించి పోస్ట్ చేసిన వారికి స్పెషల్ థ్యాంక్స్. పెయింటింగ్ చాలా నచ్చింది
ReplyDeleteOoo nadi publish chesina miku thankulu.
ReplyDeleteఅందమైన అక్షరము కపటమెరుగని హృదయము
ReplyDeleteభాష పై మమకారము రచనలన్న అనురాగము
మధురమయిన వాక్యము సొగసైన భావము
ఎంతో నిరాడంబరము మంచితనమే ఆభరణము
వినిపిచని రాగము కనిపించని నేస్తము
సున్నితము సౌశీల్యము సహనము స్నేహము
కొంటెదనాల చిత్రము మేటి శృంగార రస పోషణము
ఒకనాడు ద్రాక్షాపాకము మరునాడే నారికేళ పాకము
చాలా పురుష ద్వేషము స్త్రీ పక్షపాతము
దయ్యాల ప్రపంచము ఆత్మలతో నెయ్యము
దృఢమైన చిత్తము కడు మొండి తనము
ఇదె నేను ఎరిగిన ఆమె నిజరూప దర్శనము
పదుగురూ మెచ్చిన ఈ శ్వేత పద్మము .........