<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): An interview with 'Padmarpita' <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

22 Nov 2013

An interview with 'Padmarpita'

 
ఆనంద భాష్పాలూ విషాద అశ్రువులూ
కలగలిసి కురిసిన వర్షంలో
వింత కొలనొకటి వెలసింది.
పద్మార్పిత ఇంటి ముందు  ఖాళీ పూల కుండీలో...

కొలనంతా బురదమయం చేస్తే విషాదం,
అందులోంచే పద్మమై పుసింది ఆనందం.
ఆ ఆనందం అర్పించిన ఇంకో పద్మమే ఈ పద్మార్పిత...

వర్షంలో గంతులేద్దామని ఆత్రుతతో వచ్చిన పద్మార్పితకు చేదు అనుభవం ఎదురైంది. వర్షం కురవడం ఆగిపోయింది. అయితేనేం! వింత కొలను కొత్త లోకాన్ని చూపిస్తూ పద్మార్పితను ఆకర్షింది. ఆశ్చర్యంతో పూల కుండీలో వెలిసిన పద్మాన్ని తధేకంగా చూస్తూ ఉండిపోయింది పద్మార్పిత.

పద్మం: ఏంటి పద్మా అలా చూస్తున్నావ్? వింతగా ఉందా?
పద్మార్పిత: వింతే! కానీ నాముందు ఏంటా? అని.
పద్మం: నిజంగానే పద్మార్పిత అనిపించుకున్నావ్ తల్లీ.. అందుకే, నీకు ఇంత మంది ఫ్యాన్స్.  
పద్మార్పిత: చాల్లే సంబడం. ఇక్కడెలా వచ్చావు నువ్వు? అసలిది కలా నిజామా?
పద్మం: భూలోకంలో నీకు అభిమానుల వెల్లువ కదా. ఆ సెగ మా స్వర్గాలోకాన్ని కూడా తాకింది. నరకంలో కుడా నీకు ఫ్యాన్స్ నీరాజనాలు పడుతున్నారంట కదా. అందుకే నిన్ను చూద్దామని, అసలు నీ కవితా ఝరి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని, ఇంటర్యు చేయడానికి వచ్చాను.  నేను కిందికి వస్తుంటే మా మామ యముడు నీ క్షేమ సమాచారాలు అడగమన్నాడు. ఆయన కుడా నీకు పెద్ద ఫ్యాన్. ఇంకో విషయం ఏంటంటే, త్రిమూర్తులు ముగ్గరు కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి, నీకు దీర్ఘాయుష్షు ప్రసాదించారంట. ఎక్కడ చూసినా ఈ అగ్గిపుల్ల నారదుడి ఒకటే గుసగుస.
పద్మార్పిత: మాటలు నేర్చిన బుద్దుగుమ్మవే నువ్వు. సరే, అంత దూరం నుంచి వచ్చానన్నావు కదా. నీకు ఇంటర్యు ఇస్తున్నాను. ఎమడుగుతావో అడుగు.
పద్మం: హమ్మయ్య ఇంత సులువుగా ఒప్పుకోవు అనుకున్నా. తాంక్యు.. తాంక్యు.. 
పద్మార్పిత: ఎందుకు థాంక్స్? ఇది నా భాగ్యం. మీ అందరి అభిమానం. నా అభిమానులకో చిరు కానుక.
పద్మం: సరే. అడుగుతున్నా. మీరు కవితలు ఎందుకు రాస్తారు?
పద్మార్పిత: ఇదేం ప్రశ్న? ఎందుకంటే ఏమని చెప్పను. మొదట్లో నాకోసం రాసేదాన్ని. ఇప్పుడు మీ అందరికోసం కోసం.
పద్మం: చెప్పావులే! సమాధానం. మీ కవితల్లో ఏదో మ్యాజిక్కుంది. అని అందరు తెగ పోగిడేస్తారు. ఏంటది?
పద్మార్పిత: ఎవరు చెప్పారు. నావేవో పిచ్చి రాతలు. అందుకే అర్థం కాక మ్యాజిక్కుల్లా ఉన్నాయేమో! కదా?
పద్మం: పిచ్చిరాతలు కావు లేమ్మా! అక్షర సత్యాలే నీ రాతలూ.
పద్మార్పిత: అవునని, మరీ ఇలా తిట్టాలా?            
పద్మం: అయ్యో! పిచ్చి పద్మా ఎవరు పొగిడినా నీకు తిట్లలానే వినిపిస్తాయా? ఎందుకా పాపం నా మెడకు చుడతారు. సరే! ఇంకో ప్రశ్న. మీ కవితల్లో ఎందుకు మీరు ఊహల్లో విహరిస్తారు?
పద్మార్పిత: ఊహలైతే మనిష్టం ఎలా అయినా ఉండొచ్చు. నిజ జీవితంలో ప్రాకులాడి, దక్కకపొతే విషాదాన్ని మూట కట్టుకోవడం ఎందుకని.
పద్మం: మీ కవితల్లో ఎక్కువ పాళ్ళు ప్రేమ, ఎడబాటు, విషాదం.. ఎక్కువని అందరు చెబుతారు. దానికి మీ సమాధానం?
పద్మార్పిత: ఉండొచ్చు. కానీ వేరే కవితలూ రాసాను. మీరు గమనించాలి.
పద్మం: అయితే మీరు ఎందుకు ప్రేమ మీదే ఎక్కువ దృష్టి పెడతారు? విభిన్న అంశాలు ఎంచుకోవచ్చుగా?
పద్మార్పిత: అయ్యో! ఏమిటీ ప్రశ్న. నాకూ తెలిసినవేవో రాస్తుంటాను. అంతే తప్ప తెలియనివి రాయమంటే ఎలా?
పద్మం: అయితే మీకు సమాజం గురించి తెలియదా? అందులోని లోటుపాట్ల గురించి శరాలు సంధించండి.
పద్మార్పిత: ఎలా సంధించను? ఏమని సంధించను? నేనూ ఈ సమాజంలోనే ఉన్న దాన్నేగా.  
పద్మం: సరే! ఇంకో ప్రశ్న. మీ అందమైన రాతలూ, గీతాలూ ఒక పుస్తకంగా తెస్తే బాగుంటుంది కదా!
పద్మార్పిత: ఏంతో మంది గొప్పవారు రాసినవే ఇంకా చాలా మంది చదవలేదు. నేను పుస్తకం అచ్చేస్తే అందరూ నవ్వుతారు.  
పద్మం: ఇది కొంచెం పర్సనల్. తప్పుగా అనుకోవద్దు. మీ అసలు పేరేంటి?

                                 టు బి కంటిన్యుడ్ ఇన్ పార్ట్ – 2  

(ఇదంతా కేవలం కల్పితమ్ మాత్రమే. దయుంచి ఎవ్వరూ హర్ట్ అవ్వకండి. పద్మార్పితా గారు.. తప్పులుంటే మన్నించగలరు. ఇది కేవలం అభిమానం కొద్దీ రాసినదని అర్థం చేసుకోగలరు.)

14 comments:

  1. this is good attempt and i wants to congratulate this person who created a blog with lot of interest and affection. sorry for my english comments next time i will try to write it in telugu. bcoz i dont know how to write telugu script.

    ReplyDelete
    Replies
    1. సారీ.. ఎందుకు? నాకూ కొద్దో గొప్పో ఇంగ్లీష్ వచ్చు కదా!! మీకు సుకర్యవంతమైన బాషలోనే కామేన్టండి. మెచ్చుకోలుకు ధన్యవాదాలు.

      Delete
  2. సీరియల్ లో చెప్తారా? బాగుంది బాగుంది

    ReplyDelete
    Replies
    1. సీరియల్ లో చెప్పమంటారా? ఇంతకీ ఎన్ని ఎపిసోడ్లలో చెప్పాలో చెప్పలేదు మై డియర్ యోహాంత్..

      Delete
  3. ఇంకా పేరు దగ్గరే ఉంటే ఎలా, ఆమె అభిరుచులు, ఇష్టాయిష్టాలు వివరించమని అడగండి "పద్మం"

    ReplyDelete
    Replies
    1. హరినాథ్ గారు.. మరీ ఇంత తొందరపడితే ఎలా? తప్పకుండా రాబోయే ఎపిసోడ్లలో చూస్తారుగా....

      Delete
  4. అభిమానానిికి ఆరాధనకి చాలా తేడా ఉంది. అభిమానం సహజంగా ఉండేదే. ఆరాధన చాలా అరుదు.
    అభిమానానికి ఎండ్ పాయింట్ ఆరాధన. ఒక అక్షరం లక్ష మెదళ్లను తొలచగలదని తెలుసు.
    కాని మనిషిలో ఈ స్థాయిలో ఆరాధన పెంచుతుందని అనుకోలేదు. అల్రెడీ పేరున్న కవులను ఆరాధించడం పెద్ద
    గొప్పనిపించదు. కానీ. ఎవరో తెలీదు, ఎందుకో తెలీదు, అజ్ఞాత కవన యజ్ఞం చేస్తున్న పద్మకి లభిస్తున్న ఈ అభిమానాన్ని కచ్చితంగా గొప్పే. పద్మగారు మీరు చాలా అదృష్టవంతులు.

    ReplyDelete
    Replies
    1. డియర్ సతీష్ కొత్తూరి.. ఆరాధనో., అభిమానమో., నాకే తెలియకుంది. పద్మగారు కాదు. మనమందరం అదృష్టవంతులం అని నేనెప్పుడూ భావిస్తాను.

      Delete
  5. నన్ను అడిగి ఉంటే ఈ ప్రశ్నలకి తడబడుతూ సమాధానం చెప్పేదాన్నేమో! నాకన్నా నాగురించి ఇంతకన్నా ఎవరు చెప్పగలరు చెప్పండి. కంటిన్యూ విత్ ది నెక్స్ట్ క్వెషన్ ప్లీజ్. Thank you....interesting and very curious about myself :-)

    ReplyDelete
  6. అభిమానుల స్పందనలకు నమోఃవందనం

    ReplyDelete