<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): 2008 హైలెట్స్... <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

14 Dec 2013

2008 హైలెట్స్...


నవ్వుతో మనసులోని భావాల్ని నొక్కివేయకు నేస్తమా
దాన్ని అర్ధం చేసుకునే భాష నాకు రాదు......
మౌనంలో అర్ధాలు వెతకమనకు నేస్తమా
వేదాలు నాకు అర్ధం కావు.......


నా జీవితం ఒక గాజుబొమ్మ వంటిది***
చూసి ఆనందించడానికే కాని ఆడుకోడానికి పనికిరానిది***


నీవు మేలుకొన్న వేళ నేను సుప్రభాతమౌతాను***
నీవు నిదురపోతున్న వేళ నేను జోలపాటనౌతాను***
నీవు దూరమైన వేళ నేను సమాధినౌతాను***


కలవడం ఒకటే కాదు ప్రేమకి పునాది***
మాటలతో కూడా కట్ట వచ్చు రెండు మనసుల మధ్య వారధి***


కలలోనే కలుస్తాను అంటే అదే నా భాగ్యం అనుకుంటాను...
జీవితాంతం కనులు మూసుకుని ఉంటాను ......


నువ్వు నా హ్రుదయాన్ని తాకినంతగా నేను నిన్ను తాకలేక పోయాను.
నీతో స్నేహం చేద్దాం అనుకున్నాను నీవే నా ఊపిరై పోయావు.


సూర్యుడు కరిగి మంచు ఐన వేల,
నీ మనసు మాత్రం కరుగదు ఏల?

బ్రతుకు నిరాశ నిస్ప్రుహలతొ వున్న వేళ, ఆశల అలవై తాకావు...
నా ఈ జీవన పయనం లొ చుక్కానివై వెలుగు చూపావు...
జీవించడం నాకు నేర్పి, ఏ దూర తీరాలకో వెళ్లి పోయావు నీవు!




అలై తాకిన నీ స్నేహం
కలై కరిగెనెందుకో?
కంటికి కనబడని నీవు
కలత నిదురలొ కలవై వస్తావెందుకో?


నా ప్రేమని తెలపడం ఎలా అని ఆలోచించాను....
నా మనసు తెరచి నీ పాదాల చెంత ఉంచాను....
తలవంచని నీవు దాన్ని చూడ లేదని తెలుసుకున్నాను....


ప్రేమ కోసం ప్రాకులాడే వారు కొందరు...
ప్రేమే లోకం అనుకునే వారు మరికొందరు....
ప్రేమనే పొందని వారి భాధను గుర్తించిన వారు ఎందరు.....
అయినా ప్రేమనే పొందాలని ఆశ పడతారు అందరు....


కలలాంటి నా జీవితాన్ని కంటికెదురుగా నీతో గడపాలని***
కరిగిపోని కలగా కలసి జీవించాలని***
ఏదో ఆశ*****


దూరం అవుదామనుకున్న ప్రతిసారి దగ్గిరౌతున్నాను.*
మరచిపోవాలనే ఆలోచనలతో మరింత తలుస్తున్నాను.*


ప్రతి తలపులో నీవున్నావన్న భావన..
వాటి వలన దూరమౌతుంది నా మనోవేదన..


సువాసనలని అనుభవించ వలసిన అవసరం లేదు, ఆస్వాదిస్తే చాలు.
ప్రేమను మాటల ద్వారా తెలియపరచ వలసిన పనిలేదు,
రెండు మనసులు ఒకటైనప్పుడు, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే చాలు.


ఒక మాటుంది పదే పదే మనసుని కలవర పెడుతుంది
మనసులో దాగను అంటుంది....
అది విని నీవు నాపై అలిగితే తట్టుకునే శక్తి నా మనసుకి వుంది....
కాని నీ మనసు కలవరపడి కలత చెందితే,
శాశ్వితంగా కనులు మూసుకుని వుంటానంటుంది...

"కావాలని నిన్ను కోరివచ్చిన కన్యను కాదని అంటే
నీవు కావాలని అనుకున్నప్పుడు కన్యలే కారు
కాంతలు కూడా కంటికి కనపడకుండా కనుమరుగౌతారు ఖబర్దార్"


మనిషిని మనుషులు మోసుకెళ్తున్నారు...
తెల్లని వస్త్రంలో అతని ఆశలని కట్టకట్టి తీసుకెళ్తున్నారు...
ప్రాణాలతో వున్నప్పుడు ఏమి సాధించాడో తెలుసుకోలేకున్నారు...
భువిలో దొరకని శాంతి చితిలో దొరకదని తెలిసి కూడా రోధిస్తున్నారు...


అత్యాశకు పోకూడదని తెలుసుకున్నాను,
అందుకే ఇతరులు సంతోషంగా వుంటే చూసి ఆనందిస్తుంటాను.
ఇలాగే కాలాన్ని వెళ్ళబుస్తుంటాను.


వెక్కిళ్ళు కూడా రావడం లేదు, బహుశ నీవు నన్ను తలవడం లేదు...
అయినా నిన్ను నేను మరువ లేదు, అది నాకు చేత కాదు...


నిన్ను చూడకుండా వుండాలనుకున్నాను....
నీవుండగలవని తెలుసుకున్నాను...
నీలాగే నేను ఉండాలని ప్రయత్నిస్తున్నాను...
నేను మారకపోతే నిన్నే నాలా మారిపొమ్మంటాను...



ఇద్దరం కలసి జీవించన్నప్పుడు.......
నాపై శ్రధ్ధ చూపకు నేను దానికి అలవాటు పడిపోతాను.
నా నుండి ఏమీ ఆశించకు నేను వాటిని నెరవేర్చలేను.
నాపై నమ్మకాన్నుంచకు నేను దాన్ని నిలబెట్టుకోలేను.
నా హృదయాన్ని హత్తుకొనేలా ప్రవర్తించకు నీ నుండి విడలేకపోతాను.
నాలో ఆరాధనా భావాన్ని కలిగించకు దాన్నుండి బయటపడలేను.
నా జీవితంలో భాగమైపోకు నీవు లేకుండా నేను జీవించలేను.


ప్రేమలో మనసు కాలుతూ మనిషిని కాలుస్తుంది....
అందుకే అందరూ స్నేహభావంతో మెలగమంటుంది...
స్నేహానికి ఎటువంటి అడ్డంకులు లేవంటుంది...


నువ్వే పరాయి అయినప్పుడు వేరెవరితో పనిలేదనుకున్నాను..
పశ్చాతాపంతో ఒకరోజు నీవు తప్పుతెలుసుకుని నాదరి చేరేలోగా,
ఏదూరతీరలకో నే చేరుకుంటాను...


నీ ప్రేమను పొందలేక పోయాను...
అయినా నీకోసం ప్రాణమైనా ఇస్తాను...


ఇంక ఆగవు కన్నీళ్ళు తనలో అని తెలుసు, అవి బయటికి వస్తేవాటిని అతడు ఆపేస్తాడనీ తెలుసు. 


ఇచ్చి ఏమీ ఆశించకపోవడం నిస్వార్ధ ప్రేమ గుణం.
నువ్వు కూడా ఆలోచించు ఒక్క క్షణం.
కావాలంటావు అటువంటి ప్రేమ ప్రతిక్షణం.

కలలోనైన మనము కలసివుందాము!
మన ఎడబాటుని ఇలాగైనా కాసేపు మరచిపొదాము!

అందుకే ప్రతి ఒక్కరిలో ద్వేషాన్ని తగ్గించి
నీవు ఉన్నత శిఖరాలకి ఎదిగిపో
ఓ..............ప్రేమ



9 comments:

  1. మరోసారి చదివి ఆనందిడానికి హైలైట్స్ బాగున్నాయి

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు. తెలుగమ్మాయి

      Delete
  2. ఎంత ఓపికో

    ReplyDelete
    Replies
    1. ఓపిక కాదు. ఇది నా అదృష్టం!!

      Delete
  3. సులభతరం చేసారు. 2013 సంవత్సరంలోని పద్మార్పిత రచనల్లో చోటు చేసుకున్న మార్పుల పై ఎవరైనా రాస్తారేమో అని ఎదురు చూస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు! ఇప్పుడే అన్నీ చెప్పేస్తే ఎలా... త్వరలో తప్పక మీ ముందుకు వస్తుంది... మీరు కోరుకున్నది...

      Delete
  4. Thx for reminding da heart touching lines again....

    ReplyDelete