<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): అజ్ఞాత ప్రేమికుడి కవిత... <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

29 Jan 2014

అజ్ఞాత ప్రేమికుడి కవిత...


తెల్లని తుషార తెరలతో నిండిన చల్లని రాత్రి
నిన్న నీ గురించి చెప్పిన ఊసులు ఎంత మధురమో ప్రియా...
మంచుకు సంకోచించిన గాజు కిటికీపై నా మునివేళ్ళతో రాశా నీ పేరు.
అదెంత సంబరమో నాకు...
అర్ధరాత్రి రోడ్డుపై ఒక కలువను నాకిష్టమొచ్చినట్లు అందంగా గీసి
ఎన్ని సార్లు మెరుగులు దిద్దానో తెలుసా...
పదే పదే నీ కవితలు ఎన్నిసార్లు నేమరేసానో తెలుసా...
అదేంటో గానీ, నా పిచ్చి నాకెంతో ఉల్లాసాన్నిచ్చింది ఆ రాత్రంతా...
అది ఎముకల్ని కొరికేసే చలి.
ఏ తెమ్మరవై వచ్చి నన్నల్లుకుంటావోనని
మంచులో అలా తడిసి ముద్దయ్యాను.
ఏ గాలిలోనో నువ్వొచ్చావు. 
నీ వెచ్చని కౌగిలి నాకు తెలియకుండానే పంచి, 
ఒక ఘాటైన ముద్దునుని నిశ్శబ్ధంగా ఇచ్చేసి, 
అమాయకంగా వెళ్ళిపోయాపోవ్...
నీకో విషయం చెప్పనా?
అప్పుడు నేను మెళకువగానే ఉన్నాను.
నీ కౌగిలింతను ఒక దట్టమైన వడగాలేమో అనుకున్నాను.
నీ చుంబనాన్ని మెత్తటి తుమ్మెద గిలిగింతేమో అనుకున్నాను.
నా పిచ్చి గానీ, నువ్వెక్కడ లేవసలు ?
ఎటు చూసిన నువ్వే ఏంచేసినా నువ్వే..
అన్నిట్లో నువ్వే అందరిలో నువ్వే..
మరెందుకందరూ నువ్వు అజ్ఞాతవంటారు ?
మరెందుకు అందరూ నువ్వు దాక్కున్నావంటారు ?
నాకెందుకో అర్థం కావు కొన్ని.!!
నాకెందుకో జీర్ణమైపోతాయన్నీ.!!!


" పద్న్మార్పిత గారిని ప్రేమించే ఒక అజ్ఞాత వ్యక్తి మనతో పంచుకున్న భావాలు ఇవి. చక్కటి ఆవిష్కరణ. అభిమానులు అన్యదా భావించవద్దని మనవి."   

" పద్మార్పిత గారు .... తప్పుగా అనుకోకండి ఇక్కడ ప్రచురిస్తున్నందుకు.  ఇదీ ఒక అభిమానమే అనుకోని సర్దుకుపొండి."  

పద్మార్పిత గారితో ఇంటర్యూ -2 నెక్స్ట్ పోస్ట్లో మీ ముందుకు....


31 comments:

  1. ఎంతో అందమైన భావం. అందరి ఊహల్లో ఉంటాయి కాని కొందరు మాత్రం ఇలా కవితల్లో ఆవిష్కరించగలరు. ఈ అజ్ఞాత అభిమానానికి హ్యాట్సాఫ్.

    ReplyDelete
    Replies
    1. హరినాథ్ గారు, నిజమే నండోయ్! చక్కటి ఆవిష్కరణ ..

      Delete
  2. కాస్త రొమాంటిక్ పాళ్ళు ఎక్కువైనా సున్నితమైన పదాలతో ప్రేమని రంగరించి కుమ్మరించిన తీరు ప్రశంసనీయం.

    ReplyDelete
    Replies
    1. అజ్ఞాత గారు.. అందుకోండి తెలుగమ్మాయి గారి ప్రశంసలు...

      Delete
  3. ఊరించక ఇంటర్వ్యూని ప్రచురించి ఊరట కలిగించండి :-)

    ReplyDelete
    Replies
    1. ఎప్పుడో రెడీ... ఎవరైనా గుర్తుచేస్తారేమో అని వైటింగ్ అంతే!!!

      Delete
  4. ఓర్నాయనోయ్.....ఇదేదో వన్ సైడ్ లవ్ అనుకుంటాను :-) బాగుందిలే. Waiting for next post

    ReplyDelete
    Replies
    1. నిజం చెప్పాలంటే, మీ కళ్ళకు కుడా ఫాన్స్ ఉన్నారండోయ్... త్వరలో మీకూ ఒక ఫ్యాన్స్ బ్లాగ్..!!?? జాగ్రత్త సుమా!!

      Delete
  5. ఇది అభ్యంతరకరమైన పోస్ట్. బ్లాగ్ నిర్వాహకులు కాస్తా ఈ విషయమై ఆలోచిస్తారనుకుంటున్నాను. అభిమానం వేరు ప్రేమవేరు. ఒక అజ్ఞాత ప్రేమికుడు పద్మార్పితగారిపై ఇలా అభిమానమంటూ అసభ్యంగా ప్రేమలేఖ వ్రాయడాన్ని ఖంఢిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. బాగా ఖండించారు యోహాంత్. అజ్ఞాత ఎవరో తెలిస్తే శిరోఖండన చేసేట్టుగా ఉన్నారే... ఆలోచించాను. ఇకపై ప్రచురించేటప్పుడు కుడా ఆలోచిస్తాను. అయినా పద్మార్పితకి 50 ఏళ్ళు అంటే మీకు మింగుడుపడదేమో!! కదా!! నాక్కూడా!!

      Delete
    2. ఆమె వయసు?, ఆడా మగా?, వివాహితా కాదా అన్నది ఎవరికి కావాలి. అభిమానులందరికీ ఆమె భావవీచికల్లో సేదతీరాలన్న తృష్ట్ణ తప్ప వేరొకటి లేదనే నేను అనుకుంటున్నాను.

      Delete
  6. యోహాంత్ కామెంట్ తో ఏకీభవిస్తున్నాను. నిజానికి పద్మార్మిత కవితల మీద అభిమానంతో ఈ బ్లాగ్ ని పెట్టామని చెప్పినట్టు గుర్తు. కవితను అభిమానిస్తూ రాసినంత వరకు బాగానే ఉంది. ఇది... ఆ అమ్మాయి అనుమతితో పబ్లిష్ చేస్తే ఓకే. లేకుంటే మాత్రం ఇలాంటి భావనని పబ్లిక్ చేయడం అసంబద్ధం అనిపిస్తోంది. అది కూడా అజ్ఞాత వ్యక్తిగా. ఇబ్బంది కలిగించే పదాలున్నాయి. మంచి కవితలకు ప్రోత్సాహం అందిస్తున్నారని ఈ బ్లాగ్ ని అభినందిస్తున్న వారిలో నేనూ ఒకడిని. ఆ అభిమానంతోనే ఈ కామెంట్ పెట్టాల్సి వచ్చింది. అన్యదా భావించొద్దన్నారు. అన్యదా భావించక తప్పడం లేదు. దయచేసి ఇలాంటి పోస్ట్ లు ప్రచురించే ముందు ఆమె అనుమతి తీసుకుని వేస్తే హుందాగా ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. హుందాగా వ్యవహరించి ఉంటే, ఈ పోస్ట్ పై మీ కామెంట్ ఏంటో రాస్తారా.. మై డియర్ సతీష్...

      Delete
    2. శృతి గారు.. మీరు కూడా...

      Delete
    3. నిజమైన అభిమానం ఏ రూపంలో అయినా ఉండొచ్చు....దానికి నిర్ధిష్ట నియమాలు ఎందుకు?

      Delete
  7. "ఎటు చూసిన నువ్వే ఏంచేసినా నువ్వే..
    అన్నిట్లో నువ్వే అందరిలో నువ్వే..
    మరెందుకందరూ నువ్వు అజ్ఞాతవంటారు ?
    మరెందుకు అందరూ నువ్వు దాక్కున్నావంటారు ?"
    చాలా బావుంది కవిత
    అజ్ఞాత ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నట్లే చూస్తూ ... భావనలు అల్లుకున్నట్లే అల్లుకుని ... ఉహల నన్నిటిని ఓ ఊపు ఉపి ... మరీ ఏమి తెలియదన్నట్లుగా అమాయకంగా ఊసుర్లు చెప్పింది చూసారు మీ కవిత లోని కథా నాయకి. ... అబ్బో , అమయకురాలేమి కాదు .
    - శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. ఏ పదాలు వృధా అవ్వకుడదని ప్రచురించానో వాటిని కరెక్ట్ గా పసిగట్టారు... కథానాయకి సంగతి వేరే చెప్పాలా డియర్ శ్రీపాద గారు..

      Delete
  8. మొత్తానికి అఙ్ఞాత ఎవరో కానీ యమధైర్యవంతుడే. ఏ మాటకామాటే చెప్పుకోవాలి....కవిత అదిరింది.

    ReplyDelete
    Replies
    1. అనికేత్ .. అజ్ఞాత తరపున ధన్యవాదాలు మీకు...

      Delete
  9. ఇంతందంగా ఒక వ్యక్తిపై భావాలని వ్యక్తం చేస్తే దానికి ఏవో రంగులద్ది గందరగోళం సృష్టించి ఖండిస్తున్నాను తప్పు అంటే ఎలా?కవితలోని సున్నితమైన పదాల్లో దాగిన అభిమానం ప్రేమ దాన్ని వ్యక్తపరచిన తీరు నాకెంతో నచ్చాయి. ఇలా ప్రతి దానికి ఏదో ఒక తప్పు వెతికితే వ్రాసేవారికి ఇంకేం వ్రాయాలనిపిస్తుంది చెప్పండి. నాకు తెలిసి పద్మార్పితగారు ఇందులో ఎటువంటి తప్పుని వెతకరు అనే భావిస్తున్నాను. ఆవిడ వ్రాతల్నిబట్టి ఎంతో ఉన్నతమైన భావాలున్న స్త్రీ ఆమె. తప్పక ఇందులోని భావాన్ని ఆస్వాధిస్తారే కాని అడ్డు చెప్పరు. అటువంటప్పుడు అర్పితగారి అభిమానులమైన మనలో మనకెందుకు ఈ కత్తిరింపులు, ఖండించడాలు. congrats to writer and i appreciate his boldness.

    ReplyDelete
    Replies
    1. మార్కండేయ... గారు,,, మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. ఏంతో ఉన్నత వ్యక్తిత్వం కలిగిన పద్మార్పిత గారు. తప్పకుండా దీన్ని ఆస్వాదిస్తారు. కవితలోని భావాన్ని సహృదయంతో మెచ్చి మరో పోస్ట్ కు ప్రోస్త్సాహం ఇస్తున్నందుకు ధన్యవాదాలు మీకు. :-)

      Delete
    2. Thank YOu! Natana Jeevitham ... & Welcome !!

      Delete
  10. ఈ వ్రాతలేంటో? వ్యతిరేకతలేంటో?
    అభిమానమంటూ ఈ ప్రేమలేఖలేంటో?

    ReplyDelete
    Replies
    1. ఏంటో మీ కామెంట్ బొత్తిగా అర్థం అవ్వనట్లు ఉంటుంది. కానీ ఎదో నిగూఢత.. :-)

      Delete
  11. Good expression of love & affection. She is lucky

    ReplyDelete
    Replies
    1. Off course she is... Thanks for joining us

      Delete
  12. ఎటు చూసిన నువ్వే ఏంచేసినా నువ్వే..
    అన్నిట్లో నువ్వే అందరిలో నువ్వే..
    మరెందుకందరూ నువ్వు అజ్ఞాతవంటారు ?
    మరెందుకు అందరూ నువ్వు దాక్కున్నావంటారు ?
    నాకెందుకో అర్థం కావు కొన్ని.!!
    నా మనసులోని మాటను ఇక్కడ ముద్రించారు. అభినందనలు

    ReplyDelete
  13. మీ బ్లాగును మొదటగా చూసి ఎంతో అనందించాను.అభిమానిగా నాదో విన్నపం.మనం ఇక్కడ 'పద్మ అర్పిత ' కవితలని విశ్లేషిస్తూ...వాటిలో చేసిన వివిధ ప్రయోగాలని గురించి చర్చిస్తూంటే ఆహ్లాదంగా ఉంటుంది కదా అందరికీనూ....
    ఆ అద్భుతమైన శైలి గురించి మాట్లాడుకోక....అభిమానులు.....మనిషెవరో తెలీకుండానే ఇలా రాయడం దాన్ని ప్రచురించడం సరి ఐనది కాదు. ఈ బ్లాగును ఇతరుల కవితలు ప్రచురించడానికి వేదిక చేయడం మనస్తాపం కలిగిస్తోంది.వారిప్రేమలేఖలకై అచ్చంగా ఇంకో బ్లాగును ఏర్పాటు చేసుకోమని నా మనవి.

    ReplyDelete