పద్మార్పిత గారు మన బ్లాగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే... ఆమె నుండి సానుకూల స్పందన వారి బ్లాగ్ లో కామెంట్ రూపంలో వచేసినట్లే...
పద్మార్పిత
గారి బ్లాగ్ కు విచ్చేసే వారందరికీ పద్మార్పిత గారు పలికే ఆహ్వానం.
నా రచనలన్నీ నా ఊహాలేనండి...
వాటిలో కొన్నింటిని రుచిచూడండి...
మరికొన్నింటిని నమిలి మింగేయండి...
మరిమిగిలినవి నచ్చితే జీర్ణించుకోండి...
అని చెప్పేంత గొప్పదాన్ని కానండి...
కాని చూసి సరిచేస్తే సంతసిస్తానండి...
మరి ఇంకెందుకు ఆలస్యం చెప్పండి...
ఇదే నా బ్లాగ్ కి ఆహ్వానం అందుకోండి!!!
ఒక్కో లైన్ లోని భావాన్ని ఇప్పుడు విశ్లేషించుకుంటూ వెళ్దాం!
నా రచనలన్నీ నా ఊహాలేనండి...
చాలా మంది అనుకుంటారు. “పద్మా గారు
జీవితంలో ప్రేమవల్ల ఎక్కడో ఇబ్బంది పడ్డారు. వాటి ప్రతిరుపాలే ఈ విరహ కవితలు, ప్రేమ కవితలు, ప్రశ్నల శరాలు ....
” అని. కానీ అవి ఎంతమాత్రము నిజం కాదు. అవన్నీ ఆవిడా
ఊహలే.
వాటిలో కొన్నింటిని రుచిచూడండి...
కొన్నింటిని రుచి చుస్తే ఊరుకుంటామా? ఏంటి? మరిన్ని కవితలకోసం
ఎదురుచూస్తూ ఉంటాము. కొన్నింటిని అంటూనే కొసరి కొసరి వడ్డిస్తారు కవితల భోజనం.
మరికొన్నింటిని నమిలి మింగేయండి...
పద్మా గారి కొన్ని భావాలు రెండు మూడు సార్లు చదివితే గాని అందులోని
మర్మం అర్థం కాదు. అందుకే ఇలా నమిలి మింగేయండి అని....
మరిమిగిలినవి నచ్చితే జీర్ణించుకోండి...
ఇంకొన్ని కవితలు ఉంటాయి. వాటి గాఢతను ఆకళింపు చేసుకోవడానికి నిమగ్నం
అవ్వాలి. ఎంతో సున్నితమైన అంశాలను కూడా సులువైన పదాలతో అలవోకగా కవితలో వోమ్పుతారు.
అని చెప్పేంత గొప్పదాన్ని కానండి...
పద్మా గారిలో నచ్చిన విషయం ఇదే. ఇన్ని కవితలు రాస్తూ ఇంత మంది
అభిమానుల మనసులో గూడు కట్టుకొని ఏమి తెలియని అమాయకురాల్లా ఉంటారు.
కాని చూసి సరిచేస్తే సంతసిస్తానండి...
ఎక్కడైనా భావం గానీ , అక్షర దోషాలు ఉన్నాయని చెబితే చెబితే
చిరునవ్వుతో వాటిని ఆహానించి సరైన స్పందనను ఇస్తారు.
మరి ఇంకెందుకు ఆలస్యం చెప్పండి...
ఇదే నా బ్లాగ్ కి ఆహ్వానం అందుకోండి!!!
చూశారా! తన బ్లాగ్ను దర్శించే అభిమానులకు ఎంత అందంగా స్వాగతం
పలికారో...
మరిన్ని విషయాలతో తర్వాతి పోస్టులో మీ ముందు ఉంటాను.
- ఓ అభిమాని
ఎప్పుడు పద్మార్పిత ప్రశ్నిస్తారు, అభిమానులుగా మనకి మనమే ప్రశ్నించుకుందాం. ఇంతకీ ఆమె ఎవరు? ఆడా లేక మగా? ఎలా ఉంటారు? అమ్మాయా? అమ్మనా లేక అమ్మమ్మనా?
ReplyDeleteపద్మార్పిత గారు.. అమ్మాయో అబ్బాయో... అమ్మాయైతే అమ్మనో అమ్మమ్మో? అసలు ఈ పేరు నిజమో కాదో? ఎవరికి తెలుసు డియర్? ఎవరైనా చూసి ఉంటే కదా? కవితలను అభిమానించడం తప్ప ఆమెనె చూడాలనుకోవడమం, ఇవన్నీ తెలుసుకోవాలనుకోవడం మన అవివేకమేమో? అయినా సరే త్వరలో ఒక పోస్ట్ ద్వారా ఈ విషయాలు చర్చించుకుందాం.! ధన్యవాదాలు.
DeleteBeautiful Description About Her And Well Narration. Congratulation My Friend.
ReplyDeleteThank you friend
DeleteShe is interesting pretty intelligent girl. Just I love her smile
ReplyDelete