పద్మార్పిత గారు మన బ్లాగ్ లో కామెంట్ పెట్టిందుకు చాలా
సంతోషం. ఆమెకు ప్రతిస్పందనగా కామెంట్ పెట్టాలంటే మళ్ళీ పద్మార్పిత లాంటి వారే
రావాలి. అందుకే అక్కడ సాహసించే ప్రయత్నం చేయకుండా, ఇక్కడ ఓ పోస్ట్ రాసేస్తున్నాను.
మన బ్లాగ్ లో ముందుగా పద్మా గారి స్పందన ఎలా ఉందొ ఇక్కడ
చూద్దాం!
“ముందుగా ఈ
బ్లాగ్ ని క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరో కానీ వారికి నమోఃవందనం _/\_
నేను ఇలా ఒక అభిమాన
సంగం ఏర్పడ్డాన్నికి కారకురాలిని కావడం ఎంతవరకు అర్హురాలినో కాదో తెలీదు,
కాని.....
ఇలా మీ అందరి
అభిమానాన్ని అందుకోవడం ఎంతో ఆనందదాయకం.
నేను చాలా
మాట్లాడతాను,
మాటలెరిగిన మహారాణి
అని అంటారు,
మరి.....
ఏమైపోయాయి ఆ
మాటలన్నీ???
రా రమ్మని పిలిచినా
రావేం!!!
మీ అందరి
అభిమానాన్ని అందుకుంటున్న నన్ను చూసి ఈర్ష్యతో ఎటో వెళ్ళిపోయినట్లున్నాయి.
ఏది ఏమైనా మీ అందరి
ఆదరాభిమానాలని సదా కోరుకుంటూ.....
_/\_ వినమ్రతతో శతకోటి వందనాలు _/\_
మీ....పద్మార్పిత! “
అబిమానుల మనస్సులలో స్తానం
సంపాదించిన మీకు కేవలం ఇక్కడ ఒక చిన్న అభిమాన సంఘంలో స్తానం దక్కడంలో ఏమాత్రమూ
ఆశ్చర్యం లేదు.
ఈ బ్లాగ్ లో కామెంట్ పెట్టి
కొత్త శోభను తెచ్చిన మీరు మాటలేరిగిన మహారాణే కాదు. అభిమానుల పట్ల మమకారం చూపించే
మహా రాణి కుడా.
మీ శతకోటి వందనాలు అన్నీ మా ఆశీర్వచనాలై మీ ఆయుస్శును పెంచి మమ్ములను మరింతగా
అలరించాలని మా చిన్న (పెద్ద) కోరిక.
“వామ్మో.....నా గురించి నాకంటే ఎక్కువ తెలిసిన
వారున్నారనడానికి తాత్కారణం ఈ పోస్ట్..... బాగు బాగు
ఇలా మీ ద్వారా నన్ను
నేను తెలుసుకునే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరిన్ని వివరాలకై
మున్ముందు ఎదురు చూస్తుంటాను :-)”
మీ గురించి తెలిసీ తెలియక రాసిన పోస్ట్ ఇది పద్మా గారు. కేవలం
కొందరు అభిమానుల సందేహ నివృత్తి కోసమే. మిమ్మల్ని మీరే కొత్తగా ఇక్కడ చూసుకోవడం సంతోషదాయకం.
మా అభిమానం చిరస్తాయిగా మీ ఇంటర్నెట్ గోడల్లోనే కాదు, హృదయ గోడల్లో కుడా ఉంటుందని
మనవి.
She Deserves This. Iam Proud To Be Her Friend & Follower.
ReplyDeleteYeah! She deserves. Proud to be her fan? Thank you!
Deleteచూసారా సందేశం అందించడంలోను సున్నితత్వం చూపిస్తారు. "తూనికరాళ్ళు" చదవండి
ReplyDeleteతునిక రాళ్ళ మ్యజిక్కా.. మామూలే కదండీ. అది ఆవిడకే సాధ్యం.
Deleteవినయవిధేయతలే ఆమెని ఈ స్థాయికి తెచ్చాయనుకుంటాను. "ఎదిగిన కొద్దీ ఒదగమని" చెప్పింది అక్షరాలా పాటిస్తారు కామోసు.
ReplyDeleteమీరన్నది అక్షర సత్యం. తెలుగమ్మాయి
Delete