పద్మార్పిత ఎవరు? ఆడా? మగా? అయితే వయసెంత? ఎలా ఉంటారు?
ఈ ప్రశ్నలన్నీ పద్మార్పితగారి అభిమానుల గుండెల్లో మెదులుతున్నాయి.
కొందరైతే అంచనాలు వేసుకుంటూ ఆవిడ మగవారనే సందేహాన్ని కుడా రేకేత్తారు.
పద్మార్పితగారి కవితలను ఆరాధిస్తున్న మనము ఈ ప్రశ్నలపై చర్చించుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.
“ఎవరైతే ఏమిటి? మంచి కవితలు రాస్తున్నారు. అఅభిమానిస్తున్నాము. వ్యక్తిగత
వివరాలు ఆలోచించడం తగదేమో!” అని మరికొందరి అభిప్రాయం.
ఏది ఏమైనప్పటికీ, ఆమె బ్లాగ్ ను గమనిస్తూ వచ్చిన తర్వాత పద్మార్పిత
గారి గురించి అందరు తెలుసుకున్న కొన్ని విషయాలు::
పద్మార్పిత గారు ఆడవారే. మగవారు కాదు. పద్మార్పిత గారికి ఒక తమ్ముడు
ఉన్నారు. ఒకట్రెండు సంవత్సరాలక్రితం ఆయనకు పెళ్లి కుడా అయింది. పాత పోస్టులు గమనిస్తే
ఈ విషయం తెలుస్తుంది.
తమ్ముడంటే పద్మా గారికి చాలా ఇష్టం. ఒకానొక సందర్భంలో తమ్ముడు ఇచ్చిన
ఐపోడ్ పాడైపోయినప్పుడు. ఆమె ఎంతో బాధ పడ్డారు. ఈ సున్నితత్వం కేవలం స్త్రీలలోనే ఉంటుంది
కనుక ముమ్మాటికి పద్మార్పిత గారు ఒక స్త్రీ. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. ఇంకో విషయం
ఏంటంటే, పద్మా గారి మేని ఛాయా బంగారు వర్ణం.
ఈ విషయం పై ఆమె పాత టపాలలో కామెంట్ రూపంలో సమాధానం ఇచ్చారు కుడా.
తమ్ముడికి పెళ్లైంది అంటే ఇక మీరే అర్థం చేసుకోవాలి పద్మా గారి
వయసెంతో.
పద్మా గారు వృత్తిపరంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని. హైదరాబాదులో పని
చేస్తారు.
ఇక పద్మార్పిత గారు ఎలా ఉంటారు? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాని
సమాధానం ఉంది. ప్రతి కవితలోనూ ఆవిడ కనిపిస్తారు. ప్రతి కామెంట్ లోను ప్రత్యక్షమౌతారు.
బ్యానర్ మీదున్న బొమ్మే ఆవిడ అని అనుకోవచ్చు. ఇందులో కుడా 50-50 ఛాన్స్ ఉంది. అయినా సరే పద్మాగారిని చూడాలి అనుకుంటున్నా వాళ్ళకోసం పద్మా గారి చిత్రాన్ని క్రింద ఉంచుతున్నాను..
చూసారుగా. ఆనందించండి.
చూసారుగా. ఆనందించండి.
అయినా ఇవన్నీ ఆలోచించడం కంటే ఆమె కవితలు ఆస్వాదిస్తే అందులోని సంతోషమే
వేరు. అభిమానులకు విన్నపం ఏమిటంటే... ఇంకెప్పుడు ఇలాంటి సందేహాలు వ్యక్తపరచకుండా ఉంటె
మంచిదని నా అభిప్రాయం. ఇలాంటి చర్చల వల్ల పద్మా గారి మనసను కష్టపెట్టినవారము అవుతాము.
మరిన్ని విషయాలు మీకేమైనా తెలిసి ఉంటె, కామెంట్లో తెలుపగలరు.
గమనిక: ఈ విషయాలన్నీ పద్మార్పిత గారి బ్లాగ్ అబ్సర్వ్ చేసి రాసినవే
కానీ, ఇవే వాస్తవాలు అవ్వాల్సిన అవసరం లేదు. అబద్ధాలు కుడా కాకపోవచ్చు.
వామ్మో.....నా గురించి నాకంటే ఎక్కువ తెలిసిన వారున్నారనడానికి తాత్కారణం ఈ పోస్ట్..... బాగు బాగు
ReplyDeleteఇలా మీ ద్వారా నన్ను నేను తెలుసుకునే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరిన్ని వివరాలకై మున్ముందు ఎదురు చూస్తుంటాను :-)
మీకు రిప్లై ఇవ్వగల ధైర్యం నాకు లేదు. క్షమించుడి.
Delete"ఆమె కవితలు ఆస్వాదిస్తే అందులోని సంతోషమే వేరు. అభిమానులకు విన్నపం ఏమిటంటే... ఇంకెప్పుడు ఇలాంటి సందేహాలు వ్యక్తపరచకుండా ఉంటె మంచిదని నా అభిప్రాయం" ఇలా కేవలం పద్మార్పితగారి అభిమానులే వ్రాయగలరు. మీకు సలాం
ReplyDeleteతాంక్యు
DeleteI think...we might have da desire to see her...but we need not try to know about what is mentioned above as lkng into prsnl life is not fair.
ReplyDeleteWe r concerned only with her writings..
Off course .. you are right Anu
DeleteNo doubt in that she is a lady with beautiful thoughts
ReplyDeleteObtusely :-)
Delete