<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): January 2014 <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

29 Jan 2014

అజ్ఞాత ప్రేమికుడి కవిత...


తెల్లని తుషార తెరలతో నిండిన చల్లని రాత్రి
నిన్న నీ గురించి చెప్పిన ఊసులు ఎంత మధురమో ప్రియా...
మంచుకు సంకోచించిన గాజు కిటికీపై నా మునివేళ్ళతో రాశా నీ పేరు.
అదెంత సంబరమో నాకు...
అర్ధరాత్రి రోడ్డుపై ఒక కలువను నాకిష్టమొచ్చినట్లు అందంగా గీసి
ఎన్ని సార్లు మెరుగులు దిద్దానో తెలుసా...
పదే పదే నీ కవితలు ఎన్నిసార్లు నేమరేసానో తెలుసా...
అదేంటో గానీ, నా పిచ్చి నాకెంతో ఉల్లాసాన్నిచ్చింది ఆ రాత్రంతా...
అది ఎముకల్ని కొరికేసే చలి.
ఏ తెమ్మరవై వచ్చి నన్నల్లుకుంటావోనని
మంచులో అలా తడిసి ముద్దయ్యాను.
ఏ గాలిలోనో నువ్వొచ్చావు. 
నీ వెచ్చని కౌగిలి నాకు తెలియకుండానే పంచి, 
ఒక ఘాటైన ముద్దునుని నిశ్శబ్ధంగా ఇచ్చేసి, 
అమాయకంగా వెళ్ళిపోయాపోవ్...
నీకో విషయం చెప్పనా?
అప్పుడు నేను మెళకువగానే ఉన్నాను.
నీ కౌగిలింతను ఒక దట్టమైన వడగాలేమో అనుకున్నాను.
నీ చుంబనాన్ని మెత్తటి తుమ్మెద గిలిగింతేమో అనుకున్నాను.
నా పిచ్చి గానీ, నువ్వెక్కడ లేవసలు ?
ఎటు చూసిన నువ్వే ఏంచేసినా నువ్వే..
అన్నిట్లో నువ్వే అందరిలో నువ్వే..
మరెందుకందరూ నువ్వు అజ్ఞాతవంటారు ?
మరెందుకు అందరూ నువ్వు దాక్కున్నావంటారు ?
నాకెందుకో అర్థం కావు కొన్ని.!!
నాకెందుకో జీర్ణమైపోతాయన్నీ.!!!


" పద్న్మార్పిత గారిని ప్రేమించే ఒక అజ్ఞాత వ్యక్తి మనతో పంచుకున్న భావాలు ఇవి. చక్కటి ఆవిష్కరణ. అభిమానులు అన్యదా భావించవద్దని మనవి."   

" పద్మార్పిత గారు .... తప్పుగా అనుకోకండి ఇక్కడ ప్రచురిస్తున్నందుకు.  ఇదీ ఒక అభిమానమే అనుకోని సర్దుకుపొండి."  

పద్మార్పిత గారితో ఇంటర్యూ -2 నెక్స్ట్ పోస్ట్లో మీ ముందుకు....