<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): February 2014 <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

27 Feb 2014

పద్మార్పిత గారి గురించి భుక్య శ్రీధర్ గారు మరియు మహీ గారి మాటల్లో...


భుక్య శ్రీధర్ గారి మాటల్లో....

ఒకనోకసారి కవితల బ్లాగ్ లు వెతుకుతుండగా "​వెల ఎంతో" అన్న టపా చూసా, అప్పటినుండి నాకు ఆ బ్లాగ్ తో పరిచయం. నేను నా మొబైల్ లో మంచి మంచి బ్లాగ్స్ తాలూకు RSS ఫీడ్స్ కూడా పెడుతూ ఉంటాను, అలా ఆమె కవితలు నా మొబైల్ స్క్రీన్ పై కూడా విరాజిల్లుతాయి.కరిగే మేఘం ఉరిమి వర్షించినట్టు
హొయలుపొతు నది పొంగి ఉరకలేస్తున్నట్టు
పద్మగారి కవితలు ఎన్నటికి ఎండిపోని కావ్యసాగారం
వినూత్న ప్రయోగాల భావాల ఆబాలాగోపాలన్ని అలరించే గీతాసారం
వెన్నెల అందాలు చూడాలన్న సెలయేటి రాగాలు ఆలకిన్చాలన్న
ఆనంద డోలికలు ఊగాలన్న ప్రతిపదం ఓ ఆణిముత్యమై మెరవాలన్న
పద్మ గారి కవితకే అది సాధ్యం మరేమున్నదో ఆ సిర లో అంత మహత్యం
మనసుని కట్టిపడేసి ఆలోచింపజేసే సందేశాల కావ్య సాహిత్యం

నేను కూడా పద్మ గారి బ్లాగ్ కి ఫ్యాన్ నే.. నాకన్నా తరువాత మొదలుపెట్టి న కన్నా మంచి కవితలతో అలరిస్తున్న పద్మగారికి అభినందనలతోశ్రీధర్ భుక్య
http://kaavyaanjali.blogspot.in/


పద్మార్పిత గారి గురించి మహీ మాటల్లో....

పద్మార్పితగారితో నా బ్లాగ్ స్నేహం కేవలం కొన్ని నెలలదే అయినా ఎన్నో ఏళ్ళ అనుబంధం అన్నంతలా ఆకట్టుకునే అక్షరజ్ఞానం ఆమెది. నిస్సందేహంగా పద్మార్పితగారు స్నేహశీలి, దయ, జాలి, మంచి మనసున్న స్త్రీ అనిమాత్రం నేను చెప్పగలను. పరిపూర్ణంగా అన్ని గుణాలు ఉన్న ఒక స్త్రీని తలుచుకుంటే నాకు గుర్తుకు వచ్చే పేరు "పద్మార్పిత"
తన స్నేహితుడ్ని అని గర్వపడుతూ తలెగరేస్తూ నేను ఫోజ్ కొట్టినా ఆమె మాత్రం "అవునా అంతలేదుగా" అంటూ నవ్వేస్తూ తెలియనివెన్నో చమత్కారంగా చెప్పే చక్కని చిలిపి అల్లరితో అలరించే నెచ్చెలి......వెన్నెలని ఆడించి అలరించే చెలి.
తెల్లని స్వచ్చమైన కలువ పువ్వుకు ప్రతిరూపం అమె.....నలుపంటే ఇష్టం అంటు అందరిలోనూ మంచినే చూస్తూ చెడుని (నలుపుని) చూడలేని అనురాగవల్లి.-        Mahee

15 Feb 2014

హరినాథ్ గారి చిరు కవిత


పద్మార్పితగారి అభిమానిగా ఒక చిరుకవిత రాయాలని చాన్నాళ్ళ కోరిక. ఇందులోని పదాలు ఆమె కవితలు చదివిన ప్రోత్సాహమే తప్ప నాకు నేనుగా కవిని కాను.

                                                           - హరినాధ్

2 Feb 2014

పద్మార్పితతో ఇంటర్యూ పార్ట్ – 2పద్మం: ఇది కొంచెం పర్సనల్. తప్పుగా అనుకోవద్దు. మీ అసలు పేరేంటి?
పద్మార్పిత: ఇది అసలు పేరు కాదని ఎందుకనుకుంటున్నారు?
పద్మం: ఉహూ.. అదేం కాదు. సాధారణంగా ఏ పద్మ అనో, పద్మజా అనో, పద్మావతి  అనో.. పెట్టుకుంటారు. ఇలాంటి పేరు చాలా అరుదు అసలు నేనెప్పుడు వినలేదు కుడా. నిజం చెప్పాలంటే పద్మ  అనే పేరుకి తర్వాత ఇంకొకటి చేర్చాలంటే అది కుడా అర్పితా లాంటి గొప్ప అర్థం ఉన్న పేరును కలపాలంటే ఏంతో అంతర్మధనం చేసిఉండాలి, ఏంతో ఉన్నతమైన భావాలు ఉండాలి అని అనిపించి అడిగాను అంతే.!
పద్మార్పిత: బాబోయ్! ఇంతగా ఆలోచిస్తారా నా పేరు గురించి? నా సర్టిఫికెట్స్ చూపించనా? ఎందుకంత అనుమానం.
పద్మం: అయ్యయ్యో! ఏదో సందేహం కొద్ది అడిగానే కానీ అనుమానం మాత్రం కాదు సుమా.
పద్మార్పిత: ఓహో.. సందేహానికి, అనుమానానికి తేడా ఏంటో మరి? చెప్తావా..
పద్మం: నీకు తెలియని తేడాలా. జీవితాన్నే కాచి వడబోసినట్లు కవితలు రాసేస్తావ్ గా.. నన్నాట పట్టిస్తున్నావా? తల్లీ!
పద్మార్పిత: అవునా! సరే గానీ నేనంటే నీకు ఇష్టమా?
పద్మం: బోలెడంత ఇష్టం.
పద్మార్పిత: నీక్కూడానా. L  ఎందుకని నేనంటే అందరూ తెగ ఇష్టపడతారు?
పద్మం: నేను కదా నిన్ను ఇంటర్యూ చేద్దామని వచ్చాను. ఇలా నువ్వే నన్ను క్రాస్ కొశన్స్ వేస్తె ఎలా?
పద్మార్పిత: సరే! వద్దులే. అడుగు.
పద్మం: అలగమాకు పద్మార్పిత. చెప్పడానికి ట్రై చేస్తాను.
పద్మార్పిత: ట్రై చేయడం కాదు. నిజాలు చెప్పు. చాలు. నన్ను ఇష్టపడుతున్నారా? లేదా నా భావాలను ఇష్టపడుతున్నారా?
పద్మం: ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. అయినా చెప్తాను విను. ఇన్ని భావాలను రాసి మెప్పించే నిన్ను ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా?
పద్మార్పిత: ఏమో అనుకున్నాను. గడసరివే నువ్వూ. అయినా నన్ను చూడకుండా ఇష్టపడడం ఏంటి? కొందరైతే నన్ను ప్రేయసిగా భావించి కవితలు కూడా అల్లేస్తున్నారు. దీన్నేమంటావ్?
పద్మం: నువ్వంటే ప్రేమంటాను. అవును! అభిమానమైనా, స్నేహమైనా, ఇష్టమైనా, ఆరాధనైనా మొదట ప్రేమతోనే ప్రారంభం అవుతాయి. అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు.
పద్మార్పిత: అర్థం కాలేదు.
పద్మం: ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది. ఒకటి చెప్తాను తప్పుగా అనుకోకు. సాధారణంగా సినిమా హీరోయిన్లను అభిమానించే వాళ్ళు, ఆ హీరోయిన్లను తలుచుకుని కవితలు రాయరా? కలలు గానరా? రాం గోపాల్ వర్మ అంతటివాడే శ్రీదేవి అంటే పడి చస్తాడు. ఇదీ అంతే! ఇంకా అర్థం కాలేదు అని అంటే నీకు చెప్పడం నా వల్ల కాదు.
పద్మార్పిత: ఇది కూడా బాగుందిలే! సరే, ఈ ఉపదేశమాపి వచ్చిన పని కానివ్వు. నాకు చాలా పనులున్నాయి.
పద్మం: హమ్మయ్య! దారికోచ్చారు. ఇప్పుడు మీకో చిన్న ప్రశ్న. మీరు బొమ్మలు గీయడంలో కుడా దిట్ట అంట కదా. ఇలా కుంచె పట్టుకొని అలా గీసేస్తారంట.
పద్మార్పిత: మరీ ఇంతలా అడక్కు. నావేవో పిచ్చి గీతలు.
పద్మం: చాల్లెండి. ఇలా ప్రతీదానికీ పిచ్చి గీతలు పిచ్చి రాతలు అంటూ మమ్మల్ని పిచ్చోళ్ళు చేసేసారు. మాకంతా తెలుసు. ఎగ్జిబిషన్ పెడితే చూసి తరిస్తాం కదా. మీరే గీసుకొని మీరే చూసుకొని మీరే మురిసిపోవాలా?
పద్మార్పిత: మరీ ఎగ్జిబిషన్ లాంటి గొప్ప మాటలెందుకులే! కాలమే సమాధానం చెబుతుందిలే.
పద్మం: ఇలా తెలివిగా తప్పించుకోవడం మీకు అలవాటేగా. మీరు కామెంట్స్ కి ఇచ్చే పిప్లయ్ కోసం చాలా మంది కాచుకుని కుర్చుంటారంట. మరేమో మీరు కొన్ని పోస్ట్ లకు అసలు రిప్లయ్ లు ఇవ్వకుండానే దాటేస్తారు. ఎందుకో??
పద్మార్పిత: ఇంకా అడగలేదని చూస్తున్నా. నేనేమైనా ఇంటర్నెట్కి అంకితమైపోయి, ఎప్పుడూ ఆన్లైన్లోనే గడుపుతాను అనుకుంటున్నావా? అందరిలాగే నాకు ఏవోవో వనులు ఉంటాయిగా. అయినా, అందరికోసం వీలు కల్పించుకొని రాస్తున్నాగా. అయినా చాలా మంది నాకు పొగరు అని అనుకున్నా అతిశయోక్తి కాదేమో?!!
పద్మం: అర్పిత గారు, మీకో నమస్కారం తల్లీ. పద్మార్పితకి పొగరని అంటే మా కళ్ళు పోతాయ్...
పద్మార్పిత: మళ్ళీ ఇంకో అభాండమా నాపైన?
పద్మం: అలాకాదు పద్మా...  ఇంకో పర్సనల్ ప్రశ్న అడుగుతున్నాను. చెప్పడం చెప్పకపోవడం నీ ఇష్టం. అలా అని దాటేయకు సుమా...
పద్మార్పిత: అబ్బో!! ఏంటో అది.
పద్మం: మీకు పెళ్లయిందా???(ఇదంతా కేవలం కల్పితం. అలా అని అబద్ధం కానవసరం లేదు. నిజం అంతకన్నా కానవసరం లేదు.   )


To be continued in next part....