25 నవంబర్, 2008, మంగళవారం
25 నవంబర్, 2014, మంగళవారం
........................................ఏమిటీ తారీకులగోల అనుకుంటున్నారా??
ఆగండాగండి... చెప్తున్నా.....
సరిగ్గా ఇదే తారీకు 6 సంవత్సరాల క్రితం మంగళవారంనాడు మౌనంతో తన మొదటి కవితను ప్రారంభించి బ్లాగ్లోనూ... ఫెస్బుక్లోనూ ఎంతోమంది అభిమానం చూరగొని ఆన్లైన్ లోకంలో (ఈ-లోకం) తనకంటూ గొప్ప వ్యక్తిత్వాన్ని, వైవిధ్యాన్నీ ఆపాదించుకొని ఊహాసామ్రాజ్యాన్ని నిర్మించుకుని.... శ్వేతకవితాకలకమలమై నిర్విరామంగా సాగిపోతున్న కవితా సౌగంధిక మన పద్మార్పిత.
ఒక మంచి అందమైన నిగూడ అర్థం దాగిన పెయింటింగ్ ....అద్భుతమైన పదసంపదతో సరళమైన శైలిలో ఊహకందనివిధంగా పోటిపడే కవిత్వం... ఎంత అద్భుతమైన బ్లాగ్ ఇది.... ఇలా రాయడంలో పద్మార్పిత ట్రెండ్ సెట్టర్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పద్మార్పితగారి బ్లాగ్ ద్వారా పుట్టిన ఏకలవ్య కవులు పదులసంఖ్యలో ఉన్నారనడానికి ఆమె శైలిని అనుసరించేబ్లాగులు, ఫేస్బుక్ పేజీలు చుస్తే తెలిసిపోతుంది.
పద్మార్పిత గారు ఇలానే నిత్య నూతనంగా వైవిధ్య భరిత కవిత్వం రాస్తూ అందర్నీ అలరించాలని, మరెందరికో ఆదర్శం కావాలని కోరుకుంటూ....
- పద్మార్పిత ఫ్యాన్స్