పద్మార్పిత గారి కవితలలో మరియు అందమైన అక్షరాల్లో దాగిన నిగూడ భావాలను సునిశితంగా గమనించి చక్కటి విశ్లేషణను అందించడంలో సతీష్ కొత్తూరి గారిది అందెవేసిన చేయి (ఎంతైనా జర్నలిస్ట్ గారు కదా). పద్మార్పిత గారు రాసిన "కాలం కరిగి" అనే కవితకి సరితూగే చిత్రాన్ని ఎంపిక చేయలేదని చాలా మంది భావన. సతీష్ కొత్తూరి గారి ఒక్క విశ్లేషణతో ఆ సందేహం అసంబద్ధమైనదని తేలిపోయింది. పద్మార్పిత గారి కవితలను ఎంతగా లీనమై చదివి ఆకళింపు చేసుకుంటారో చెప్పడానికి తార్కాణం ఈ ఒక్క విశ్లేషణ.
ఈ ఒక్క కవితకే కాదు, పద్మార్పితగారు రాసిన చాలా వరకు కవితలకి సతీష్ గారు రాసిన విశ్లేషణలు ఒక కొత్తదానాన్ని చేకూర్చాయి అనడంలో అతిశయోక్తి లేదు.
( కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పద్మార్పిత గారితో ఇంటర్యూ-3. దానికీ దీనికి లింక్ ఏంటి అని అడక్కండి. )
* సతీష్ కొత్తూరి గారి అనుమతి లేకుండా ఈ పోస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతోంది.