<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): పద్మార్పిత గారికి స్పూర్తినిచ్చిన సతీష్ కొత్తూరి గారి ఒక విశ్లేషణ ! <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

14 May 2014

పద్మార్పిత గారికి స్పూర్తినిచ్చిన సతీష్ కొత్తూరి గారి ఒక విశ్లేషణ !




               పద్మార్పిత గారి కవితలలో మరియు అందమైన అక్షరాల్లో దాగిన నిగూడ భావాలను సునిశితంగా గమనించి చక్కటి విశ్లేషణను అందించడంలో సతీష్ కొత్తూరి గారిది అందెవేసిన చేయి (ఎంతైనా జర్నలిస్ట్ గారు కదా). పద్మార్పిత గారు రాసిన "కాలం కరిగి"  అనే కవితకి సరితూగే చిత్రాన్ని ఎంపిక చేయలేదని చాలా మంది భావన. సతీష్ కొత్తూరి గారి ఒక్క విశ్లేషణతో ఆ సందేహం అసంబద్ధమైనదని తేలిపోయింది. పద్మార్పిత గారి కవితలను ఎంతగా లీనమై చదివి ఆకళింపు చేసుకుంటారో చెప్పడానికి తార్కాణం ఈ ఒక్క విశ్లేషణ. 

               ఈ ఒక్క కవితకే కాదు, పద్మార్పితగారు రాసిన చాలా వరకు కవితలకి సతీష్ గారు రాసిన విశ్లేషణలు ఒక కొత్తదానాన్ని చేకూర్చాయి అనడంలో అతిశయోక్తి లేదు. 


               
( కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పద్మార్పిత గారితో ఇంటర్యూ-3. దానికీ దీనికి లింక్ ఏంటి అని అడక్కండి. )        


* సతీష్ కొత్తూరి గారి అనుమతి లేకుండా ఈ పోస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతోంది.

12 comments:

  1. ఓహో ......ఆమెకి కూడా స్ఫూర్తిని ఇచ్చేవారు అవసరమే!

    ReplyDelete
  2. చిత్రం చెప్పే భావనలు చిత్ర విచిత్రం అని ఇలాగే తెలిసింది .

    ReplyDelete
  3. మా పద్మార్పిత ఏం చేసినా అర్ధం పరమార్ధం ఉంటుంది

    ReplyDelete
  4. ఎక్కడండీ....కవితలు చదివి అర్థం చేసుకునే సమయమే చిక్కడంలేదు. ఇంక చిత్రాల భాష ఎప్పుడు నేర్చుకుంటానో ఏమో. ఇలా ఎవరైనా వివరిస్తే చదివేసి ఆనందించేస్తే హాయిగా ఉంటుంది కదా!

    ReplyDelete
  5. నాకూ ఆవిడ చిత్రాలని చదవడం వచుచు కొంచెం కొంచెం :-)

    ReplyDelete
  6. ఆమె కవితలోని భావాలకి కుంచె కూడా తలవంచి సలాం చేస్తుంది అనేట్లుగా ఉంటాయి. చిత్రాల ఎంపికలో అమె ఒక కళానిధి.

    ReplyDelete
  7. పద్మార్పిత కవితల్లో నర్మగర్భంగా జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలు స్పృశిస్తారు. అవి నాకు చాలా బాగా నచ్చుతాయి. సహజంగానే సైకాలజీలో నాకు ప్రవేశం ఉంది. పద్మ కవితల్లో ఫిలాసఫీ టింజ్‌ ఎక్కవగా ఉంటుంది. సైకాలజీతో ఫిలాసఫీని మదించడం నాకు చాలా ఇష్టం. ఆ రకంగా పద్మగారు తన కవితల ద్వారా నా సైకాలజీకి
    చాలా పదును పెట్టారు... నేనే ఆవిడకు కృతజ్ఞతలు చెప్పాలి. ధన్యవాదాలు నా భావనను అర్థం చేసుకుని ఆదరించి.. ఇక్కడ పోస్ట్ చేసినందుకు. ఇలాంటి వాటికి అనుమతులు అవసరం లేదు.

    ReplyDelete
    Replies
    1. సతీష్ గారూ మీరు చెప్పాక మేము ఒప్పుకోవలసిందే. లేకపో నా సైకాలజీ అంతా కాచివడపోసి ఆటో బయోగ్రఫీ రాసేస్తారేమో కదా :-)

      Delete
  8. ఆమె నాకు తెలిసీ ప్రతినిర్జీవికీ ప్రాణంపోసి వాటితో ఊసులాడతారు. మీకు ఆమె పాత కవితల్లో అక్కడక్కడా ఈ విషయం గమనింఛే ఉంటారు. వస్తువులన్నింటితో కబుర్లు చెప్తూ ఒంటరితనానికి దూరంగా ఉండగలం అని పద్మగారి దగ్గర నుండే అలవరుచుకున్నాను.

    ReplyDelete
  9. అందరికీ స్పూర్తినిచ్చేవారికి కొందరుంటారు స్పూర్తిదాయకంగా.

    ReplyDelete
  10. Thanks to all for their likes, love and affection

    ReplyDelete
  11. కేంద్రంలో ప్రభుత్వం ఫాం అయ్యింది. పోస్ట్ ఎప్పుడు మరి ?

    ReplyDelete