నమస్కారమండి. నా
పేరు నందిని. నేను కొంత మంది స్నేహితులు పద్మార్పిత బ్లాగ్ గురించి
చర్చించుకున్నప్పుడు ఏదో ఆతిగా అంటున్నారు అనుకుని చదివి అతి కొద్దికాలంలోనే
అభిమానిగా మారాను. మీరు ఎవరో తెలియక పోయినా మీరు చూపిస్తున్న అభిమానం ప్రశంసనీయం.
చక్కని ఆమె కవితల్ని మీరు కూర్చిన విధానం చాలా బాగుంది. అసలు కవిత్వం అంటే కేవలం గొప్ప పండితులు రాసే అర్థం కానిది అనుకున్న నాకు
పద్మార్పితగారి సరళ పదాల సాహిత్యం చదివి ఎంతో ముచ్చటేసింది. గత కొద్దినెలలుగా ఆమె బ్లాగ్ చూస్తున్నా ఈ మధ్యనే కమెంట్స్
పెట్టడానికి అకౌంట్ తెరిచాను.
ఇక్కడ రాసింది నిజానికి మిత్రుల చర్చల్లో దొర్లిన మాటలు. కొన్నాళ్ళుగా మా మధ్య పద్మార్పిత అయితే ఈ మాటని ఇలా చెబుతారు అలా చెబుతారు అని చిన్ని చిన్ని కవితలు అల్లుకుని నవ్వుకుంటాము. ఆ మాటలే నేను మీకు రాసి పంపుతున్నాను.