10 Sept 2015
2 Sept 2015
విశ్వేశ్వర్రావు గారి మాటల్లో పద్మార్పిత....
ఉద్యోగరీత్యా కార్యాలయానికి వెళ్ళినప్పుడు మాటల్లో అనుకోకుండా పద్మార్పిత బ్లాగ్ చూడ్డం జరిగింది. ఇన్నాళ్ళు ఏదో కోల్పోయిన భావం నాలో ఉండేది. కొద్దిరోజుల్లో పదవీ విరమణ చేయబోతున్న నేను ఏం చేయాలి అనుకునే సమయంలో ఆమె బ్లాగ్ చూసి కవితలు చదువుతు కాలక్షేపం చేయవచ్చు కొన్నాళ్ళు అనే ధైర్యాన్ని ఇచ్చాయి.
ఆమె కవితలు అద్భుతం అనడంలో సంకోచమే లేదు. ఈరోజుల్లో ఇంత సరళ పదాలతో తెలుగుభాషలోని తీపిదనాన్ని గుర్తుచేసిన ఆమె భాషాపటిమకు అబ్బురంతోపాటు ఆనందం కలిగించింది. ఇక పద్మార్పిత ఫాన్స్ అంటూ కమెంట్స్ వ్రాసినవి చదివి, కొద్దిసేపు ఇది నిజమా లేక కలా అనుకుని ఈ బ్లాగ్ చూస్తే ఏవైనా నాలుగు మాటలు వ్రాయకపోతే చదివి దండగని వ్రాస్తున్నాను. నాకు చదివి ఆస్వాదించడమే తప్ప వాటికి అక్షర రూపం ఇవ్వడమ్రాదు. బ్లాగ్ చూసి పొందిన అనుభూతిని ఒక అభిమానిగా పంచుకోవాలని వ్రాసాను.
ఇట్లు
విశ్వేశ్వర్రావు
సదా మీ ఆశీర్వచనాలు ఆమెకు ఉండాలని కోరుకుంటూ పద్మార్పిత గారిపై ఇక్కడ మీరు మీ భావాల్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండి.
::Happy Superannuation ::
Subscribe to:
Posts (Atom)