తీపిచేదు
మొదలైన భావషడ్రుచుల కలయిక పద్మార్పిత అందించు అలరించే కవితలమాలిక మత్తో మాయో
తెలియని గమ్మతో
ఆమె వ్రాయు అక్షరాలు కాదు మాటలమూటలు మనసును మురిపించి మెలిపెట్టును అక్షరాలు తెలుగు పదాలు
ఆమె కలంలో తేనెలూరి చిత్రాలు అందాలను ఎన్నింటినో సింగారించుకుని నవరసాలు
కలగలపి ఉత్తేజపరుచు కవితలు మల్లెల పరిమళం వెన్నెల చల్లదనాన్ని జతకలిపి ఆవేశం అనురాగం
ఆవేదన హాస్యం ప్రేరణ ఉల్లాసం అన్నీ సమయానుసారం సమపాళ్ళలో భావుకతను జోడించి అందించడం ఆమె
కవితలకు కుంచెకే సొంతం సాధ్యం.