...
ఓయ్....
నీకూ
నాకూ ఒకేరకమైన అనుభూతులు కవ్విస్తున్నా,
నిశ్చలత్వాన్ని
నిమిషమే పాటిస్తామెందుకో..
ఆ
నిశ్చలత్వంలోనే కొన్ని వేల అంతులేని ప్రశ్నల ఆనవాళ్ళు..
అవి
అనుభూతులనుకోనా..? పెనుభూతాలనుకోనా..?
నీ
ఎదురుగా ఉండి నిన్నడుగుతున్న ప్రశ్నల తాలూకు జవాబులన్నీ
నీలోనే
ఒంపేసుకుని ఆ వెటకారపు ఘోష..
అది
జవాబు నువ్వనా..? జాడ తెలియదనా..?
నీ
స్తబ్దత నేర్పే పాఠాలకి జీవితాలే పాఠశాలలు..
అలా
నీలో నువు ఇముడ్చుకున్న అంతరంగానికి
అవసరాల
హోరెక్కువ కదా..
అందుకే
అలుపెరగని పరుగుతో నీకూ నాకూ సరి..