<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): తేజోవంతమైన సమఉజ్జీ పద్మార్పిత - Tej <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

31 Aug 2021

తేజోవంతమైన సమఉజ్జీ పద్మార్పిత - Tej

 ... ఓయ్....

నీకూ నాకూ ఒకేరకమైన అనుభూతులు కవ్విస్తున్నా,

నిశ్చలత్వాన్ని నిమిషమే పాటిస్తామెందుకో..

ఆ నిశ్చలత్వంలోనే కొన్ని వేల అంతులేని ప్రశ్నల ఆనవాళ్ళు..

అవి అనుభూతులనుకోనా..? పెనుభూతాలనుకోనా..?

నీ ఎదురుగా ఉండి ని‌న్నడుగుతున్న ప్రశ్నల తాలూకు జవాబులన్నీ

నీలోనే ఒంపేసుకుని ఆ వెటకారపు ఘోష..

అది జవాబు నువ్వనా..? జాడ తెలియదనా..?

నీ స్తబ్దత నేర్పే పాఠాలకి జీవితాలే పాఠశాలలు..

అలా నీలో నువు ఇముడ్చుకున్న అంతరంగానికి

అవసరాల హోరెక్కువ కదా..

అందుకే అలుపెరగని పరుగుతో నీకూ నాకూ సరి..



8 comments:

  1. ఇది ఎవరి ఘోష?

    ReplyDelete
  2. evaru evaritho polchukovatam waste
    writeup your own feelings not compare andi.

    ReplyDelete
  3. వ్యధల్లో రకాలు వేరు కానీ అందరూ సమ ఉజ్జీలే కదా...అనుభూతులు అందరివీ ఒకేలా ఎందుకుంటాయి? కవ్వించే వాటికి కళ్ళుం వేసి సాగిపోవడమే మన చేయగలం. మీ అభిమాన అక్షర స్రవంతికి నా వందనములు.

    ReplyDelete
  4. విచిత్రం చిత్రం అక్షరం.

    ReplyDelete
  5. నేను పద్మార్పితగారి అభిమానిని

    ReplyDelete
  6. మీ భావాలు బాగున్నాయి.

    ReplyDelete
  7. అనుభూతులా లేక ఆలోచనలు అనుకోవాలి అంటారా?

    ReplyDelete