23 Sept 2017
7 Sept 2017
4 Sept 2017
4 Dec 2016
10 Oct 2016
1 Sept 2016
పద్మార్పిత గారిపై శ్రీ మాధవరావు పూర్వాషాడ గారి భావాలు
తీపిచేదు
మొదలైన భావషడ్రుచుల కలయిక పద్మార్పిత అందించు అలరించే కవితలమాలిక మత్తో మాయో
తెలియని గమ్మతో
ఆమె వ్రాయు అక్షరాలు కాదు మాటలమూటలు మనసును మురిపించి మెలిపెట్టును అక్షరాలు తెలుగు పదాలు
ఆమె కలంలో తేనెలూరి చిత్రాలు అందాలను ఎన్నింటినో సింగారించుకుని నవరసాలు
కలగలపి ఉత్తేజపరుచు కవితలు మల్లెల పరిమళం వెన్నెల చల్లదనాన్ని జతకలిపి ఆవేశం అనురాగం
ఆవేదన హాస్యం ప్రేరణ ఉల్లాసం అన్నీ సమయానుసారం సమపాళ్ళలో భావుకతను జోడించి అందించడం ఆమె
కవితలకు కుంచెకే సొంతం సాధ్యం.
17 Jun 2016
పద్మార్పిత గారి గురించి ఫాన్స్ బ్లాగుతో శ్రీధర్ భూక్యా ముచ్చట్లు...
ఒకానొక రోజునా నా బ్లాగ్ లా వేరెవరైన తెలుగులో చక్కగా కవితలు రాస్తారా అనే సందేహంతో గూగుల్ లో వెతుకుతుండగా పద్మ గారి బ్లాగ్ కనిపించింది..
ఆమే రాసే పదాలన్ని భావాల్లో అమాంతం ఇమిడిపోతాయి
ఎంచుకున్న విషయం ఏదైన చక్కని రీతిలో ఆవిష్కృతం చేస్తారు.
ఎన్నో సార్లు పద్మ గారు రాసే కవితలకి ధీటుగా సమాధానం వ్యాఖ్యానించటానికి ప్రయత్నిస్తు ఉంటా..
నా తెలుగు చూసి నా మాతృభాష తెలుగు అనుకుంటారు కాని నా మాతృభాష తెలుగు కాదు.. కాని తెలుగు గడ్డపై పుట్టాను..
కథలా కవితను కనువిందుగా కమనీయంగా
ఏ భావోద్వేగానైనా అవలీలగా రచన చేస్తు ఉంటారు.. వారానికి ఒక మంచి కవితతో ఆబాలగోపాలాన్ని అలరిస్తు ఉంటారు..
పచ్చటి పైరులో పరిభ్రమించే పైరగాలిలా
వినీలాకాశానా విహరించే విహంగంలా
ఆమే అక్షరాలు అలరిస్తాయి అందరిని
21 May 2016 18:43
Thank You Padma Gaaru
Thank You Padmarpita Fans Gaaru
Subscribe to:
Posts (Atom)