<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): వెల్కం టు పద్మర్పిత ఫ్యాన్స్ బ్లాగ్ <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

19 Oct 2013

వెల్కం టు పద్మర్పిత ఫ్యాన్స్ బ్లాగ్


తెలుగు బ్లాగ్ చరిత్రలో పద్మార్పిత గారి బ్లాగ్ ఓ సంచలనం. పద్మార్పిత గారి గురించి చెప్పాలంటే మాటలు చాలవు. బ్లాగే కదా! వేలమంది తెలుగు బ్లాగర్లున్నారు. అందులో ఈవిడా ఒకరు. అంత మాత్రానికే సంచలనమా? అని అడగొచ్చు. అందుకే వెంటనే ఆమె బ్లాగ్ ను దర్శించేయండి. ఇదిగో ఇక్కడ నొక్కండి. http://padma4245.blogspot.in/  ఇదే పద్మా గారి బ్లాగ్. 

ఆగండాగండి. ఇప్పుడే వెళ్ళకండి. బ్లాగ్ గురించి కొన్ని విషయాలు చెబుతాను. అప్పుడు వెళుదురు గాని. 


బ్లాగ్ ఓపెన్ చేయంగానే.. Kunstler Script ఫాంట్ లో ఆమె పేరు అందంగా దర్శనమిస్తుంది. చూడగానే ఆకట్టుకునే ఒక అందమైన తెలుగమ్మాయి ముఖం నవ్వుతూ స్వాగతం పలుకుతుంది బ్యానర్ మీద. 
పక్కనే అక్షరాలూ నక్షత్రాలూ కలిసిపోయి అచ్చ తెలుగులో ' పద్మార్పిత' దాని కిందనే ' మదిలోని భావాలని (పక్కన నాలుగు నక్షత్రాలు) ' అని ఆమె మదినే మన ముందు  ఉంచుతున్నట్లు అనిపిస్తుంది. 

ఇదంతా చూసేలోపే ఆప్యాయతతో పలికే ఒక వేణువు గానం మన గుండెల్ని ఇంకోలోకంలో తెసుకెళ్ళే ఢంకా నాదాలతో కలిసి ' ఎన్నెన్నో వర్ణాలు .... ' అనే పాటతో బ్లాగ్ లోని భావాలన్నింటిని చెప్పేస్తూ స్వాగతం పలుకుతాయి. ఆ పాట కేవలం పద్మార్పితా గారి కోసమే రాసి ట్యూన్ చేసారేమో అని అనిపించినా అతిశయోక్తి కాదు.

ఇది కేవలం బ్యానర్ వరకే. ఇంకా బ్లాగులోకి తొంగి చూడనే లేదు.  ఇప్పుడు వెంటనే బ్లాగ్ను దర్శించండి. ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత చెప్పుకుందాం!

16 comments:

  1. How come u got this wonderful idea?

    Great....I am proud to be a part of her writings.....in da sense....enjoying n writing my feelings n getting da response from her.....
    U know..... I admire her personality...character.... n da will power that is reflected in her writings....I think she might be da woman with all these qualities....n I'm eagerly waiting to see her.
    I just could not stop myself from writing all this.
    Anyway....congrats for this......no more words.....CONGRATS....thats'it.....

    ReplyDelete
    Replies
    1. Dear Anu, Thank you for comming to this ( our) blog and sharing your feelings about Padmarpita garu.
      If you want to tell any thing about Padmarpita or her blog, please send your feeling to e.mail: padmarpitafans@gmail.com

      I am also a fan want to meet Padmarpita garu. Lets hope.. our dreams will surely come true.

      Thanks againg.

      Delete
    2. మీరు పంపే మెయిల్ ఇక్కడ ఒక పోస్ట్ గా ప్రచురించపడుతుంది మీ పేరుమీదనే..

      Delete
  2. Happy to see this, I am also a member....let her walk rock :)

    ReplyDelete
  3. నేను ఒక ఫ్యాన్ నే నాకు చూడాలని ఉంది.

    ReplyDelete
    Replies
    1. @తెలుగమ్మాయి... వేచిచుడక తప్పదేమో..

      Delete
  4. Very Great Idea:-)) I am also member in the Blog:-))

    ReplyDelete
  5. గుడ్ ఐడియా. నాకెందుకు ఇది తట్టలేదు అనుకుంటూ ఒక అభిమానిగా అభినంధిస్తున్నాను మిమ్మల్ని. తెలుగులోనే ఆమెకి కమెంట్స్ వ్రాయండి అదే మిమ్మల్ని తెలుగు పండితుడ్ని చేస్తుంది అన్న ఆమె మాటల్ని ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాను. మీకు ఒక అభిమాన సంఘం ఉందని అందులో నేను ఒకరిని అని చెప్పుకోడానికి గర్విస్తున్నాను పద్మార్పితగారు.

    ReplyDelete
    Replies
    1. యోహంత్.. ధన్యోస్మి. మీ అభిమానం ఎల్లవేళలా ఆమెపై ఉండాలని ఆశిస్తున్నా.

      Delete
  6. నేను సైతం అభిమానినే

    ReplyDelete
  7. ముందుగా ఈ బ్లాగ్ ని క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరో కానీ వారికి నమోఃవందనం _/\_
    నేను ఇలా ఒక అభిమాన సంగం ఏర్పడ్డాన్నికి కారకురాలిని కావడం ఎంతవరకు అర్హురాలినో కాదో తెలీదు,
    కాని.....
    ఇలా మీ అందరి అభిమానాన్ని అందుకోవడం ఎంతో ఆనందదాయకం.
    నేను చాలా మాట్లాడతాను,
    మాటలెరిగిన మహారాణి అని అంటారు,
    మరి.....
    ఏమైపోయాయి ఆ మాటలన్నీ???
    రా రమ్మని పిలిచినా రావేం!!!
    మీ అందరి అభిమానాన్ని అందుకుంటున్న నన్ను చూసి ఈర్ష్యతో ఎటో వెళ్ళిపోయినట్లున్నాయి.
    ఏది ఏమైనా మీ అందరి ఆదరాభిమానాలని సదా కోరుకుంటూ.....
    _/\_ వినమ్రతతో శతకోటి వందనాలు _/\_
    మీ....పద్మార్పిత!

    ReplyDelete