3 Dec 2021
7 Sept 2021
బ్లాగ్ తో సాయిద్రుప గారి అనుభవాలు...
పద్మార్పితగారికి...మీ
బ్లొగ్ చూసాను అమోఘం. మీ సౌంధర ఆరాధనకు ప్రతిబింబం మీ బ్లొగ్ అని వ్రాయడంలో
అటువంటి సందేహము లేదు. ఒకటిని మించిన పరిపూర్ణతను ప్రతీ కవితలో కనబడుతుంది. లాక్
డౌన్ కరోనా కాలం మీ కవితలు ఎంతో ఊరటను కలిగించాయి. నాన్నగారు 83వయస్సు వారు మీ పోస్టులను చూసి ఎంతో
ఆనందించి మీ మేదస్సును నైపుణ్యాన్ని కొనియాడుతూ ప్రశంసించినారు. నేను
మీ బ్లొగ్లో కమెంట్స్ రూపంలో వివరించలేక ఇక్కడ తెలియజేస్తున్నాను. మీకు అభిమాన
సంఘము కలిసికట్టుగా పనిచేస్తుంది అనుకుని వ్రాస్తున్నాను. మీరు
మరెన్నో కవితలు వ్రాసి అందరినీ మెప్పించాలని కోరుకుంటున్నాము. మీకు శ్రావణమాస
శుభాశ్శిస్సులు మరియు వందనములు.
31 Aug 2021
తేజోవంతమైన సమఉజ్జీ పద్మార్పిత - Tej
...
ఓయ్....
నీకూ
నాకూ ఒకేరకమైన అనుభూతులు కవ్విస్తున్నా,
నిశ్చలత్వాన్ని
నిమిషమే పాటిస్తామెందుకో..
ఆ
నిశ్చలత్వంలోనే కొన్ని వేల అంతులేని ప్రశ్నల ఆనవాళ్ళు..
అవి
అనుభూతులనుకోనా..? పెనుభూతాలనుకోనా..?
నీ
ఎదురుగా ఉండి నిన్నడుగుతున్న ప్రశ్నల తాలూకు జవాబులన్నీ
నీలోనే
ఒంపేసుకుని ఆ వెటకారపు ఘోష..
అది
జవాబు నువ్వనా..? జాడ తెలియదనా..?
నీ
స్తబ్దత నేర్పే పాఠాలకి జీవితాలే పాఠశాలలు..
అలా
నీలో నువు ఇముడ్చుకున్న అంతరంగానికి
అవసరాల
హోరెక్కువ కదా..
అందుకే
అలుపెరగని పరుగుతో నీకూ నాకూ సరి..