<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు) <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

14 Nov 2015

ఏడు సంవత్సరాలు కొలువుదీరిన కలువ బొమ్మకు శుభాకాంక్షలు!

బ్లాగ్ లోకం లో 7 వసంతాలు పూర్తీ చేసుకొని, 8 వ సంవత్సరంలో అడుగెడుతున్న అర్పితకు అభినందనాంజలి!!  

ఇప్పటిదాకా ఆమె రాసిన పోస్టులు ఒక ఆర్డర్ లో ఇలా మీ ముందుకు 







2 Sept 2015

విశ్వేశ్వర్రావు గారి మాటల్లో పద్మార్పిత....


 
ఉద్యోగరీత్యా కార్యాలయానికి వెళ్ళినప్పుడు మాటల్లో అనుకోకుండా పద్మార్పిత బ్లాగ్ చూడ్డం జరిగింది. ఇన్నాళ్ళు ఏదో కోల్పోయిన భావం నాలో ఉండేది. కొద్దిరోజుల్లో పదవీ విరమణ చేయబోతున్న నేను ఏం చేయాలి అనుకునే సమయంలో ఆమె బ్లాగ్ చూసి కవితలు చదువుతు కాలక్షేపం చేయవచ్చు కొన్నాళ్ళు అనే ధైర్యాన్ని ఇచ్చాయి.

ఆమె కవితలు అద్భుతం అనడంలో సంకోచమే లేదు. ఈరోజుల్లో ఇంత సరళ పదాలతో తెలుగుభాషలోని తీపిదనాన్ని గుర్తుచేసిన ఆమె భాషాపటిమకు అబ్బురంతోపాటు ఆనందం కలిగించింది. ఇక పద్మార్పిత ఫాన్స్ అంటూ కమెంట్స్ వ్రాసినవి చదివి, కొద్దిసేపు ఇది నిజమా లేక కలా అనుకుని ఈ బ్లాగ్ చూస్తే ఏవైనా నాలుగు మాటలు వ్రాయకపోతే చదివి దండగని వ్రాస్తున్నాను. నాకు చదివి ఆస్వాదించడమే తప్ప వాటికి అక్షర రూపం ఇవ్వడమ్రాదు. బ్లాగ్ చూసి పొందిన అనుభూతిని ఒక అభిమానిగా పంచుకోవాలని వ్రాసాను.
ఇట్లు
విశ్వేశ్వర్రావు

సదా మీ ఆశీర్వచనాలు ఆమెకు ఉండాలని కోరుకుంటూ పద్మార్పిత గారిపై ఇక్కడ మీరు మీ భావాల్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండి.
::Happy Superannuation ::

14 May 2015

పద్మార్పిత గారి గురించి నందిని & ఫ్రెండ్స్ ముచ్చట్లు!!

మస్కారమండి. నా పేరు నందిని. నేను కొంత మంది స్నేహితులు పద్మార్పిత బ్లాగ్ గురించి చర్చించుకున్నప్పుడు ఏదో ఆతిగా అంటున్నారు అనుకుని చదివి అతి కొద్దికాలంలోనే అభిమానిగా మారాను. మీరు ఎవరో తెలియక పోయినా మీరు చూపిస్తున్న అభిమానం ప్రశంసనీయం. చక్కని ఆమె కవితల్ని మీరు కూర్చిన విధానం చాలా బాగుంది. అసలు కవిత్వం అంటే కేవలం గొప్ప పండితులు రాసే అర్థం కానిది అనుకున్న నాకు పద్మార్పితగారి సరళ పదాల సాహిత్యం చదివి ఎంతో ముచ్చటేసింది. గత కొద్దినెలలుగా ఆమె బ్లాగ్ చూస్తున్నా ఈ మధ్యనే కమెంట్స్ పెట్టడానికి అకౌంట్ తెరిచాను. 

ఇక్కడ రాసింది నిజానికి మిత్రుల చర్చల్లో దొర్లిన మాటలు. కొన్నాళ్ళుగా మా మధ్య పద్మార్పిత అయితే ఈ మాటని ఇలా చెబుతారు అలా చెబుతారు అని చిన్ని చిన్ని కవితలు అల్లుకుని నవ్వుకుంటాము. ఆ మాటలే నేను మీకు రాసి పంపుతున్నాను.




6 Mar 2015

పద్మార్పిత గారి బ్లాగ్లో 400 పోస్టులు !!



Her poetry turns words into art 
and desert into wood...
Her poetry can express emotions of the heart
and ethics of the Love ....
Many of her famous poems are famous 
for just that reason....