14 Sept 2014
19 Jun 2014
పద్మార్పిత గారితో ఇంటర్యూ – 3
పద్మం: అలాకాదు పద్మా...
ఇంకో పర్సనల్ ప్రశ్న అడుగుతున్నాను. చెప్పడం చెప్పకపోవడం నీ ఇష్టం.
అలా అని దాటేయకు సుమా...
పద్మార్పిత: అబ్బో!! ఏంటో అది.
పద్మం: మీకు పెళ్లయిందా??
*
* * * *
పద్మం : మీకు పెళ్ళయిందా ??
పద్మార్పిత : యస్ మై డియర్. అయింది.
పద్మం :
అవునా !!!!! :-((
పద్మార్పిత : ఎందుకలా మొహం మాడ్చుకున్నావు?
అప్పుడెప్పుడో 2008 నవంబర్ లో అయింది. అభిమానులను కుడా ఇన్వైట్ చేసేదాన్ని. కానీ
అప్పుడు వాళ్ళెవరూ నాకు తెలియదు కదా!
పద్మం : అవునా!! ఇలా మా అందరికీ షాకులిస్తే
ఎలాగండి.
పద్మార్పిత : ఇంకో విషయం చెప్పనా? నాకు పిల్లలు కూడా
ఉన్నారు. ఇంకా బోలెడంతమంది మనవవరాళ్ళు కూడా.
పద్మం :
అవునా.. చెప్పండి చెప్పండి. ఎప్పుడు ? ఏమిటి ? ఎలా ?
పద్మార్పిత : చెప్తాను విను. అప్పుడు, ఉరుముల మెరుపుల
గాలివాన ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. నా మనస్సులో మాత్రం ఏదో ప్రశాంతత.
ఆపుడోచ్చింది ఆ అర్ధరాత్రి ఒక ఆలోచన. పెళ్లి చేస్కోవాలని. అనుకున్నదే తడవుగా, నా
ఆప్తులతో చర్చించి అప్పుడే, ఆ బలహీన క్షణానే పెళ్లి చేస్కున్నాను.
పద్మం : స్టొరీ కొంచెం వెరైటీగా ఉంది. చెప్పండి చెప్పండి....
పద్మర్పిత : ఓహో...ఇంత క్యురియాస్ గా ఉందా? పెళ్లి ఎవరితో
అంటే__________________.
పద్మం :
హా హ్హా హా... నిజమే నిజమే.. అలా మొదలైందన్నమాట. మరి పిల్లలు, మనవరాళ్ళు ?
పద్మార్పిత : ప్రతి కవిత ఒక ప్రసవవేదనగా భావిస్తే నా
కవితలన్నీ అందమైన, ముద్దు ముద్దు పిల్లలే కదా! వాటికి స్పందించే అభిమానుల/ పాఠకుల
కామెంట్లే నాకు మనవళ్ళు, మనుమరాళ్ళు.
పద్మం : పద్మా... ఇలా కవితలని, బ్లాగుని, మీ
అభిమానులను అందర్నీ ఒక కుటుంబంగా భావించి, మీరు చూపించే ప్రేమకు మా అభిమానుల అందరి
తరపున సలాం. ఒకసారి శ్రీపాద గారు అన్నారు మీరొక సంస్థ అని. అది ముమ్మాటికీ నిజం.
పద్మార్పిత : అలా అని నన్ను మీ అందర్నుంచి వేరు
చేస్తారా? ఇదేం బాలేదు.
పద్మం : ఇలా గోముగా అల్లరి చేస్తావనే,
హరినాద్ గారు నిన్ను అల్లరి అర్పిత అంటారు. ఇజమే మరి.
పద్మార్పిత : ఓహో... ఇప్పుడర్థమైంది. వాళ్ళందరి తరపున
నన్ను ఇంటర్యూ చేయడానికి వచ్చావా?
పద్మం : కాదు కాదు. నేనే స్వయంగా దివి నుంచి
భువికోచ్చాను. నీ కీర్తి పతాకాలు మా లోకంలో కూడా రెపరెపలాడుతున్నాయి మరీ....
పద్మార్పిత : అమ్మా పద్మమా. చాలమ్మా నీ తిట్ల దండకం.
పద్మం :
అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. మీ తిట్ల కవిత సూపర్. ఎవరైనా తిడితే కోపమొస్తుంది.
అదేంటో గానీ మీరు తిడితే ఉన్న కోపం కూడా తుర్రుమని ఎగిరిపోతుంది.
పద్మార్పిత : అవునా! ఏదేదో చెప్పెస్తావ్ నువ్వు.
పద్మం : ఇప్పుడు మీ అభిరుచులు ఇష్టాలు మాతో
పంచుకుంటారా?
పద్మార్పిత : ఓ యస్. అడిగేసేయ్.
పద్మం :
మీకు ఇష్టమైన ఆట.
పద్మర్పిత : దాగుడుమూతలు.
పద్మం :
అవునా. ఇప్పటికీ కంటిన్యు చేస్తున్నారా? బావుంది బావుంది. మీ లక్కీ నెంబర్ ?
పద్మార్పిత : పద్నాలుగు. (ఎందుకంటె పలికేటప్పుడు “పద్మా” అని అందులో
కలుస్తుంది కదా!)
పద్మం :
మీ పేరంటే అంతిష్టం అన్నమాట. మీకు నచ్చిన ఒక సినిమా?
పద్మార్పిత : ఫత్మా
పద్మం :
ఇది కూడా మీ పేరులో కలుస్తుందన్నమాట. అయితే మీకు నచ్చే హాస్య నటుడు?
పద్మార్పిత : పద్మనాభం గారు.
పద్మం : మీరు ఏ పార్టీకి
వోట్ వేసారు?
పద్మార్పిత : కేంద్రంలో చక్రం తిప్పుతోంది కదా. అదేనండి పద్మం గుర్తున్నది.
పద్మం : మీరు ఇష్టంగా తినే పళ్ళు?
పద్మార్పిత : కమలా పళ్ళు.
పద్మం : మీరు అందుకోవాలనే అవార్డులు ఏవైనా
ఉన్నాయా?
పద్మార్పిత: నా పేరుమీదనే
అవార్డులు ఇస్తుంటే ఇంకా నాకు అవార్డులు ఎందుకు. (పద్మశ్రీ, పద్మ భూషణ్) మీరందరూ
నాతొ ఉంటె అదే చాలు.
పద్మం: అయ్యబాబోయ్...
అన్నిటికీ అన్ని ఫటాఫట్ సమాధానాలు చెప్తారు. మిమ్మల్ని విశ్లేషించాలంటే సతీష్
కొత్తూరి గారే కరెక్ట్. నా లాంటి మందబుద్ధులకు అది చాలా కష్టం.
పద్మార్పిత: నీకు మందబుద్దా!!
ఇక్కడ నన్ను ఎడా పెడా ఎకిపారేస్తుంటే. ఏదీ ఒక సామెత విసురు చూద్దాం!
పద్మం: ఇంకేం విసరను. మీ
“ నటనా జీవితం “ ఐస్‌క్రీం ఫోటో లో ఉన్న మీ అభిమాని... కవితకొకటి విసురుతుందిగా.
పద్మార్పిత: ఓహో.. వాళ్ళపై
కూడా నీ రీసెర్చ్ జరుతోందా? ఇంక నన్ను వదిలేయ్ తల్లీ. ఇక్కడ ఆఫీస్‌కి టైం అవుతోంది.
నీ ప్రశ్నలేమైనా ఉంటే, నెక్స్ట్ పార్ట్ లో అడుగు. వస్తాను.టేక్ కేర్........
14 May 2014
పద్మార్పిత గారికి స్పూర్తినిచ్చిన సతీష్ కొత్తూరి గారి ఒక విశ్లేషణ !
పద్మార్పిత గారి కవితలలో మరియు అందమైన అక్షరాల్లో దాగిన నిగూడ భావాలను సునిశితంగా గమనించి చక్కటి విశ్లేషణను అందించడంలో సతీష్ కొత్తూరి గారిది అందెవేసిన చేయి (ఎంతైనా జర్నలిస్ట్ గారు కదా). పద్మార్పిత గారు రాసిన "కాలం కరిగి" అనే కవితకి సరితూగే చిత్రాన్ని ఎంపిక చేయలేదని చాలా మంది భావన. సతీష్ కొత్తూరి గారి ఒక్క విశ్లేషణతో ఆ సందేహం అసంబద్ధమైనదని తేలిపోయింది. పద్మార్పిత గారి కవితలను ఎంతగా లీనమై చదివి ఆకళింపు చేసుకుంటారో చెప్పడానికి తార్కాణం ఈ ఒక్క విశ్లేషణ.
ఈ ఒక్క కవితకే కాదు, పద్మార్పితగారు రాసిన చాలా వరకు కవితలకి సతీష్ గారు రాసిన విశ్లేషణలు ఒక కొత్తదానాన్ని చేకూర్చాయి అనడంలో అతిశయోక్తి లేదు.
( కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పద్మార్పిత గారితో ఇంటర్యూ-3. దానికీ దీనికి లింక్ ఏంటి అని అడక్కండి. )
* సతీష్ కొత్తూరి గారి అనుమతి లేకుండా ఈ పోస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతోంది.
28 Apr 2014
9 Apr 2014
27 Mar 2014
పద్మార్పిత గారి బ్లాగ్... సైడ్ బార్ లో కొత్త స్కెచ్ !!
చాలా కాలం తర్వాత పద్మార్పిత గారు, బ్లాగ్ లోని సైడ్ బార్ లోని పాత చిత్రాన్ని తొలగించి కొత్త స్కెచ్ తో మనముందుకోచ్చారు.
మునుపటి చిత్రం మరియు ఇప్పటి చిత్రాన్ని గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. పాత చిత్రంలో కొద్దిగా వేదనున్నా కనిపించకుండా ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఇప్పటి చిత్రంలో వేదన ప్రస్పుటంగా కనిపిస్తున్నా, కన్నీరు మాత్రం కనిపించడంలేదు.
ఎందుకో ఈ రెండు చిత్రాలను చూసి ఇలా రెండు రకాల అభిప్రాయాన్ని ఒక అభిమానిగా ఈ చిన్ని కవితలో అభిమానుల ముందుంచే ప్రయత్నం.
అభిమానుల అభిప్రాయాలకు సాదర స్వాగతం!!
మీ అభిప్రాయాల్ని గానీ, ఆమె పై మీరు రాసిన కవితలను గానీ ఒక పోస్ట్ గా చూడదలుచుకుంటే padmarpitafans@gmail.com కి పంపగలరు.
17 Mar 2014
Subscribe to:
Posts (Atom)